న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరలు అడ్డు, అదుపు లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ వాటి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇంధన ధరలను పెంచే విషయంలో చమురు సంస్థలు మొహమాటానికి పోవట్లేదు. వాహనదారులపై అదనపు భారాన్ని మోపుతూనే ఉన్నాయి. ఇవ్వాళ మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి చమురు సంస్థలు. అసలే కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల రూపంలో అదనపు భారం పడుతోంది.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల మేర పెంపుదల కనిపించింది. ఒకేసారి లీటర్ ఒక్కింటికి 35 పైసలు పెంచడం అంటే మాటలు కాదు. రికార్డుస్థాయి పెరుగుదల ఇది. తాజాగా పెరిగిన ధరలతో దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్ ధర లీటర్ ఒక్కింటికి 115 రూపాయలను దాటింది. డీజిల్ సైతం వంద రూపాయల మార్క్‌ను దాటేసింది. 35 పైసల చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వరుసగా ఇది రెండోసారి.

దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.105.49 పైసలకు చేరింది. డీజిల్ 94.22 పైసలుగా నమోదైంది. ముంబైలో పెట్రోల్ రూ.111.43 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్ ధర వంద రూపాయలను దాటింది. రూ.102.15 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ.102.70 పైసలు, డీజిల్ ధర రూ.98.59 పైసలుగా నమోదైంది. పెట్రోల్ అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం మూడు రూపాయల మేర పన్నును తగ్గించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయినట్టయింది. వరుసగా పెంచుతోన్న ధరల వల్ల ఇప్పుడు అక్కడ కూడా పెట్రోల్ ధర వంద రూపాయల మార్క్‌ను దాటింది.
కాగా- తాజా పెంపుతో కోల్‌కతలో పెట్రోల్ ధర రూ.106.10 పైసలుగా నమోదైంది. డీజిల్ ధర రూ.97.33 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.109.16, డీజిల్ రూ.100.00 పైసలు, లక్నోలో పెట్రోల్ రూ.102.15 పైసలు, డీజిల్ రూ.94.31 పైసలకు చేరింది. భోపాల్‌లో పెట్రోల్ రూ.114.09 పైసలు, డీజిల్-103.40 పైసలు పలుకుతోంది. పాట్నాలో పెట్రోల్ రూ.108.84 పైసలు, డీజిల్ రూ.100.79 పైసలుగా రికార్డయింది.
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.73 పైసలు, డీజిల్ రూ.102.80 పైసలు పలుకుతోంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.55 పైసలు, డీజిల్ ధర రూ.103.99 పైసలకు చేరింది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 116.44 పైసలకు చేరింది. డీజిల్ రేటు 105.59 పైసలు.
ఈ పెరుగుదల ఇక్కడితో ఆగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకమైంది. ఇక్కడితో ఆగలానూ కనిపించట్లేదు. ఇదివరకట్లా మళ్లీ వరుసగా వాటి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచబోవనే గ్యారంటీ ఉండట్లేదు. ఈ నెల ఆరంభంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వల్ల- మున్ముందు మరిన్ని వాతలు ఉంటాయనే సంకేతాన్ని చమురు కంపెనీలు ఇవ్వకనే ఇచ్చినట్టయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల్లో చోటు చేసుకున్న పెరుగుదల వల్లే ఇంధన ధరలను సవరించాల్సి వచ్చిందని చమురు కంపెనీలు చెబుతున్నాయి.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్, డీజిల్‌పై రూ. 10 పన్ను తగ్గింపు.. అయినా సామాన్యులకు ఊరట లేదు! ఏందుకంటే..

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications