35వ రోజు పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?
న్యూఢిల్లీ: సుమారు రెండున్నర నెలల పాటు పెట్రోల్, ఇంధన ధరలు వాహనదారులను గజగజమంటూ వణికించాయి. వాహనాన్ని రోడ్డు మీదికి తీసుకుని రావాలంటే ఒకటికి రెండు ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని కల్పించాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రారంభ రోజుతో పోల్చుకుంటే.. లీటర్ ఒక్కింటికి 30 నుంచి 35 రూపాయల మేర పెరుగుదల కనిపించింది. ఈ స్థాయిలో జేబులను కొల్లగొట్టిన చమురు సంస్థలు శాంతించాయి. ధరల పెంపుదల జోలికి వెళ్లట్లేదు. 35 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచట్లేదు. అదే సమయంలో డీజిల్ ధరలను కాస్త తగ్గించడం ఊరట కలిగించేదే.
ఈ పెరుగుదల వల్ల దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి వంద రూపాయల మార్క్‌ను దాటేసింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో 110 రూపాయలకు చేరింది పెట్రోల్. దాని వెనుకే డీజిల్ ధర కూడా పరుగులు తీసింది. తమిళనాడుకు మాత్రం మినహాయింపునివ్వొచ్చు. పెట్రోల్ అమ్మకాలపై మూడు రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది ముఖ్యమంత్రి స్టాలిన్ సారథ్యంలో అక్కడ అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం. ఈ తరహా తగ్గింపు దేశంలో మరే ఇతర రాష్ట్రం కూడా చేయలేదు.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లను పరిగణనలోకి తీసుకుంటే.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.101.84 పైసలు పలుకుతోంది. డీజిల్ రూ.89.27 పైసలుగా కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రేటు 107 రూపాయలను దాటింది. లీటర్ ఒక్కింటికి రూ.107.83 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్ ధర 97.04 పైసలుగా నమోదైంది. చెన్నైలో పెట్రోల్ రూ.102.49 పైసలుగా ఉండగా.. డీజిల్ ధర రూ.93.84 పైసలుగా రికార్డయింది.
కోల్‌కతలో పెట్రోల్ ధర రూ.102.08 పైసలుగా నమోదైంది. డీజిల్ ధర రూ.92.32 పైసలు పలుకుతోంది. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.105.25 పైసలు, డీజిల్ రూ.94.65 పైసలు, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.105.83 పైసలు, డీజిల్ రూ.97.33 పైసలు, కు తగ్గింది. భోపాల్‌లో పెట్రోల్ రూ.110.20 పైసలు, డీజిల్ రూ.98.05 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.98.92 పైసలు, డీజిల్ రూ.89.61 పైసలు, గాంధీనగర్‌లో పెట్రోల్ రూ.98.79 పైసలు, డీజిల్ ధర తగ్గి రూ.96.33 పైసలుగా రికార్డయింది. తిరువనంతపురంలో పెట్రోల్ రూ.103.82 పైసలు, డీజిల్ రూ.95.86 పైసలు పలుకుతోంది.


Click it and Unblock the Notifications