వరుసగా పదహారో రోజు స్థిరంగా పెట్రోల్ ధరలు, 2021లో 16సార్లు జంప్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 16వ రోజు స్థిరంగా ఉన్నాయి. గతవారం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగి 18 నెలల గరిష్టానికి చేరుకున్నప్పటికీ, దేశీయ చమురు రంగ కంపెనీలు మాత్రం ధరలు పెంచలేదు. దీంతో ఫిబ్రవరి 27వ తేదీ తర్వాత నుండి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. చివరిసారి ఫిబ్రవరి 27న పెట్రోల్ లీటర్ 24 పైసలు, డీజిల్ లీటర్ 15 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దేశీయ చమురు రంగ కంపెనీలు ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ఇంధన ధరలను సవరిస్తాయి.

70 డాలర్లు దాటినా...
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పైకి, కిందకు కదులుతున్నాయి. గతవారం ఏకంగా ఏడాదిన్నర గరిష్టానికి చేరుకొని, 70 డాలర్లను క్రాస్ చేసింది. అయినప్పటికీ దేశీయంగా ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.91.17, డీజిల్ రూ.81.47 వద్ద ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.97.57, డీజిల్ రూ.88.60గా ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లీటర్‌కు రూ.100 దాటిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ రూ.101.84, డీజిల్ రూ.93.77, మధ్యప్రదేశ్‌లోని అనుపూర్‌లో పెట్రోల్ లీటర్ రూ.101.59, డీజిల్ రూ.91.97గా ఉంది.

14 సార్లు పెరిగింది
ఫిబ్రవరి ప్రారంభం నుండి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్‌కు 7 డాలర్లు పెరిగాయి. ఈ నెల పదిహేను రోజుల్లో ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(OMCs) ఢిల్లీలో పెట్రోల్ ధరలు 14సార్లు పెంచగా, రూ.4.22కు పెరిగింది. డీజిల్ ధర రూ.4.34 పెరిగింది. క్రూడాయిల్ ధర నిన్న బ్యారెల్ 69.2 డాలర్ల వద్ద ఉంది. 2021లో పెట్రోల్, డీజిల్ ధరలు 26 సార్లు పెరిగాయి. ఈ రెండున్నర నెలల కాలంలో (2021లో) పెట్రోల్ పైన రూ.7.46, డీజిల్ రూ.7.60 పెరిగింది.

చమురు ధరల వినియోగం
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం, దీనికి తోడు దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో భారత్‌లో చమురు డిమాండ్ పైన ప్రభావం చూపుతున్నాయి. చమురు వినియోగం గత ఏడాది సెప్టెంబర్ నుండి దాదాపు ఐదు శాతం మేర క్షీణించింది. డీజిల్ ధరల వినియోగం 8.5 శాతం క్షీణించగా, గ్యాసోలైన్ డిమాండ్ 6.5 శాతం తగ్గింది.


Click it and Unblock the Notifications