For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్పులేని పెట్రోల్, డీజిల్ ధరలు..శాంతించినట్టేనా?: దానికి బదులుగా

|

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇవ్వాళ కూడా మార్పు లేదు. చమురు కంపెనీలు వాటి రేట్ల జోలికి వెళ్లలేదు. వరుసగా రెండో రోజు కూడా ఇంధన రేట్లను పెంచలేదు. బుధవారం నాటి రేట్లే కొనసాగుతున్నాయి. అయినప్పటికీ- కొద్దిరోజులుగా వరుసగా భారీగా పెరుగుతూ వస్తోన్న ధరల వల్ల పెట్రోల్ రేటు అనేక నగరాల్లో 110 నుంచి 120 రూపాయల మధ్య ఉంటోంది. డీజిల్ పరిస్థితీ దాదాపు ఇంతే. 100 నుంచి 110 రూపాయల మేర పలుకుతోంది.

పెట్రోల్, డీజిల్ ధరలను చమురుసంస్థలు కొద్దిరోజులుగా పెంచుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. కిందటి నెలలో ఈ పెరుగుదల ఆరంభమైంది. లీటర్‌పై సగటున ప్రతీరోజూ 80 పైసల మేర భారం పడుతూ వచ్చింది. ఫలితంగా లీటర్‌పై 10 రూపాయల మేర అదనపు భారాన్ని వాహనదారులు భరించే పరిస్థితి ఏర్పడింది. ఈ పెంపుదల పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. తన పంథానూ మార్చుకోలేదు.

Petrol and diesel prices on April 8, 2022: remain unchanged for 2nd straight day

17 రోజుల వ్యవధిలో 14 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ దరలు నిలకడగా ఉన్నందున ఈ రెండు రోజులూ ఇంధన రేట్లను సవరించలేదు చమురు కంపెనీలు. బుధవారం నాటి రేట్లే ఇవ్వాళ కూడా కొనసాగుతున్నాయి. దీని ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.105.41 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ120.51 పైసలు, డీజిల్ రూ.104.77 పైసలుగా నమోదైంది.

కోల్‌కతలో పెట్రోల్ రూ.115.12 పైసలు, డీజిల్ రూ.99.83 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.110.85 పైసలు, డీజిల్ 100.94 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.111.09 పైసలు, డీజిల్ రూ.94.79 పైసలుగా ఉంటోంది. గుర్‌గావ్‌లో పెట్రోల్ రూ.105.86 పైసలు, డీజిల్ 97.10 పైసలు. అదే సమయంలో ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్లు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, పైప్డ్ నేచురల్ గ్యాస్ రేట్లను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన విషయం తెలిసిందే. గృహావసర వినియోగదారులను సైతం వదల్లేదు. కమర్షియల్ సిలిండర్లపైనా భారం మోపింది.

English summary

మార్పులేని పెట్రోల్, డీజిల్ ధరలు..శాంతించినట్టేనా?: దానికి బదులుగా | Petrol and diesel prices on April 8, 2022: remain unchanged for 2nd straight day

Petrol and diesel prices remain unchanged for second straight day in Friday relief
Story first published: Friday, April 8, 2022, 8:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X