పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని నగరాల్లో పెరిగినప్పటికీ, మొత్తానికి స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరిగి, ఆ తర్వాత కాస్త శాంతించాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసినట్లుగా కనిపించడంతో బ్రెంట్ 112 డాలర్లు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 109 డాలర్లకు తగ్గింది. ఓ సమయంలో 130 డాలర్లు క్రాస్ చేశాయి. అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ, ఎన్నికల కారణంగా నాలుగు నెలలుగా భారత్‌లో ధరలు స్థిరంగా ఉన్నాయి.
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (మార్చి 10, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. అయితే ధరల్లో ఎలాంటి మార్పులేదు. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి. మూడు నెలలకు పైగా ధరల్లో మార్పులేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉండనుంది. ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరుగుతున్నాయి. బడ్జెట్‌కు తర్వాత కూడా మన వద్ద స్థిరంగా ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు లేదా ఫలితాల తర్వాత ధరలు పెరుగుతాయని మొదటి నుండి వినిపిస్తున్న వార్తలు. రేపో మాపో పెరగవచ్చు. ధరలు ఎప్పుడైనా పెరగవచ్చుననే ఉద్దేశ్యంతో పెట్రోల్ బంకుల వద్ద జనాలు వరుస కడుతున్నారు. ఒకేసారి ట్యాంకు ఫుల్ చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ఢిల్లీలోను అక్కడి ప్రభుత్వం వ్యాట్‍ను తగ్గించింది. వ్యాట్‌ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది. ఆ తర్వాత జార్ఖండ్ ప్రభుత్వం టూవీలర్స్‌కు లీటర్ పెట్రోల్ పైన రూ.25 తగ్గింపును అమలు చేసింది. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్‌కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్‌లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.05గా ఉంది.
లీటర్ డీజిల్ ఢిల్లీలో రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్‌కతాలో రూ.89.79, ముంబైలో రూ.94.14, హైదరాబాద్‌లో రూ.94.62, విశాఖపట్నం రూ.95.18గా ఉంది.
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ అతి తక్కువగా దొరుకుతుంది పోర్ట్ బ్లెయిర్‌లో. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.82.96, లీటర్ డీజిల్ రూ.77.13గా ఉంది.
పాకిస్తాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల భారీగా పెరిగాయి. పాక్ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ధరలను రూ.10 నుండి రూ.12 వరకు పెంచింది. దీంతో ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర కొన్ని ప్రాంతాల్లో రూ.160కి చేరుకుంది. మనవద్ద మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఘట్టం ముగిసిన తర్వాత పెరుగుతాయి.
అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. WTI క్రూడ్ 109 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ 112 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు ఇటీవల పైపైకి చేరుకున్నాయి. నిన్న ఉక్రెయిన్ ప్రకటన తర్వాత కాస్త శాంతించాయి. అంతకుముందు ఓ సమయంలో 130 డాలర్లకు చేరుకుంది. 2014లో తొలిసారి బ్యారెల్ చమురు 100 డాలర్లకు చేరుకుంది. గత నాలుగు నెలలుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. డిసెంబర్ నెలలో 10.22 శాతం, జనవరిలో 17 శాతం, ఫిబ్రవరిలో 10.7 శాతం పెరిగాయి.
అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల ప్రభావం భారత్ పైన ప్రభావం చూపుతుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు వస్తున్నాయి. ఆ తర్వాత ఎప్పుడైన పెట్రోల్, డీజిల్ ధరలు రూ.10 నుండి రూ.20 పెరిగే అవకాశముంది. అదే జరిగితే రవాణా ఖర్చులు పెరిగి, ఇతర ఛార్జీలు పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ స్పందించారు. మీ వాహనాలలో ఫ్యూయల్ ట్యాంకులను ఇప్పుడే ఫిల్ చేసుకోండని సూచించారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications