పెట్రోల్, డీజిల్ ధరల్లో నేడు (గురువారం, జూన్3) ఎలాంటి మార్పులేదు. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు వరుసగా రెండోరోజు ధరలను పెంచలేదు. జూన్ 1వ తేదీన ఇంధన ధరలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. మొన్న పెట్రోల్ పైన 26 పైసలు, డీజిల్ పైన 23 పైసలు పెరిగింది.
ఢిల్లీలో పెట్రోల్ లీటర్ పైన రూ.94.49, డీజిల్ లీటర్ రూ.85.38గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.100 దాటింది. పెట్రోల్ రూ.100.72, డీజిల్ రూ.92.69కు చేరుకుంది. మే 4వ తేదీ నుండి ఇది 17వ సార్లు పెరిగింది. పెట్రోల్ పైన రూ.4.09, డీజిల్ పైన రూ.4.65 పెరిగింది. రాజస్థాన్ లోని గంగానగర్‌లో లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.105.52కు చేరుకుంది. గ్యాసోలైన్ ధరలు ముంబైలో రూ.100 దాటింది. తద్వారా న్యూయార్క్ నగరంలో కంటే ఇక్కడే ఖరీదుగా మారింది.

ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. ఉదాహరణకు ఢిల్లీలో చూసుకుంటే మే 16న లీటర్ పెట్రోల్ రూ.92.88గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూసుకుంటే లీటర్ పెట్రోల్ బేస్ ప్రైస్ రూ.34.19. రవాణా తదితర ఖర్చులు 0.36 పైసలు. డీలర్స్‌కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.34.55. ఎక్సైజ్ డ్యూటీ రూ.32.90. డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.3.77. వ్యాట్ రూ.21.36. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ మే 16వ తేదీన రూ.83.22గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూస్తే బేస్ ప్రైస్ రూ.36.32. రవాణా తదితర ఖర్చులు 0.33 పైసలు. డీలర్స్‌కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.36.65. ఎక్సైజ్ డ్యూటీ రూ.31.80. డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.2.58. వ్యాట్ రూ.12.19.
మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. చమురు ధరలు బ్యారెల్ 70 డాలర్లతో మూడు నెలల గరిష్టాన్ని తాకాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఆగస్ట్ 94 సెంట్లు లేదా 1.4 శాతం లాభపడి 70.26 డాలర్లకు చేరుకుంది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ జూలై 1.34 శాతం ఎగిసి 67.66 డాలర్లను తాకింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications