పెట్రోల్, డీజిల్ ధరలు నేడు(మార్చి 27, ఆదివారం) పెరిగాయి. వరుసగా రెండు రోజుల పెరుగుదల తర్వాత ఒకరోజు స్థిరంగా ఉన్న ధరలు, మళ్లీ మూడు రోజులు వరుసగా 80 పైసల చొప్పున పెరిగాయి. ఈ ఆరు రోజుల్లో ఐదుసార్లు కూడా 80 పైసల చొప్పున పెరిగాయి. నవంబర్ 4, 2021 తర్వాత మార్చి 22వ తేదీ నుండి ధరలు పెరుగుతున్నాయి. మధ్యలో ఒకరోజు స్థిరంగా ఉంది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరిగి, ఆ తర్వాత కాస్త శాంతించాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లుగా కనిపించడంతో ధరలు కాస్త క్షీణించాయి.
అయినప్పటికీ నాలుగు నెలల క్రితం ధరతో పోలిస్తే దాదాపు 30 డాలర్లు పెరిగింది. దీపావళి తర్వాత మన వద్ద ధరలు పెరగలేదు. ఎన్నికలు, ఎన్నికల ఫలితాల తర్వాత పెరుగుతాయని భావించినప్పటికీ పెరగలేదు. దీపావళికి ముందు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ 70 డాలర్లకు కాస్త పైన ఉంది. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 130 డాలర్లు దాటినప్పటికీ, ప్రస్తుతం కాస్త తగ్గి 110 డాలర్ల వద్ద ఉంది. నాలుగు నెలల్లో దాదాపు 30 డాలర్లు పెరగడంతో ధరలు పెరుగుతాయనే అంచనాలు మొదటి నుండి ఉన్నాయి. కానీ చాలా ఆలస్యంగా పెరిగాయి.
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (మార్చి 25, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. మూడు నెలలకు పైగా ధరల్లో మార్పులేదు. నాలుగు రోజుల నుండి పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉంటుంది.

ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి.
చాలా రోజులుగా మన వద్ద స్థిరంగా ఉండి ఇప్పుడిప్పుడే పెరుగుతున్నప్పటికీ, పలు ఇతర దేశాల్లో ఇప్పటికే ధరలు భారీగా పెరిగాయి. పాకిస్తాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు కొద్ది రోజుల క్రితం భారీగా పెరిగాయి. అక్కడి ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ధరలను రూ.10 నుండి రూ.12 వరకు పెంచింది. దీంతో ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర కొన్ని ప్రాంతాల్లో రూ.160కి చేరుకుంది. మనవద్ద మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక శ్రీలంకలో అయితే లీటర్ పెట్రోల్ రూ.207కు చేరుకుంది.
తాజా పెరుగుదల అనంతరం ఢిల్లీలో పెట్రోల్ రూ.99.11, ముంబైలో రూ.113.88, డీజిల్ రూ.96.70, కోల్‌కతాలో పెట్రోల్ రూ.109కి చేరువైంది. చెన్నైలో పెట్రోల్ రూ.105కు చేరువైంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications