Petrol, diesel Price: త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం..!
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఏడాది కాలంగా మారకుండా స్థిరంగా కొనసాగుతోన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా.. దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదు. దీంతో పెట్రోలియం కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. కానీ సామాన్యుడి భారం కొనసాగుతోంది. అందుకే తగ్గిన ధరల ప్రయోజనం వినియోగదారులకు అందించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తగ్గిన ముడి చముర ధర కారణంగా పెట్రోల్‌పై లీటరుకు రూ.17, డీజిల్‌పై లీటరుకు ₹3-4 లాభాన్ని పొందుతున్నాయి. నివేదిక ప్రకారం, చమురు మంత్రిత్వ శాఖ ఇప్పటికే OMCలతో ముడి, రిటైల్ ధరల పరిస్థితులపై చర్చించింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ఇప్పుడు లాభాలను ఆర్జిస్తున్నందున, ప్రజలకు కొంత ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ఈ విషయంపై చర్చలు ప్రారంభించిందని నివేదిక పేర్కొంది.

ప్రస్తుత ముడి చమురు ధరల పరిస్థితిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, చమురు మంత్రిత్వ శాఖ చర్చిస్తున్నాయి. గత మూడు త్రైమాసికాల్లో బలమైన లాభాల కారణంగా, OMCల మొత్తం నష్టాలు తగ్గాయి. IOC, HPCL, BPCL అనే మూడు OMCల ఉమ్మడి లాభం గత త్రైమాసికంలో రూ.28,000 కోట్లుగా ఉందని నివేదిక పేర్కొంది. OMCల అండర్ రికవరీ ముగిసినందున, వినియోగదారులు కూడా ప్రయోజనాలను పొందాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఒక వేళ పెట్రోల్, డీజిల్ ధరల తగ్గినట్లయితే దేశంలో ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ ముడి చమురుపై ఆధారపడిన దేశంగా ఉంది. భారత ప్రభుత్వం ప్రత్యమ్నాయలపై దృష్టి సారిస్తున్నప్పటికీ చమురు దిగుమతి మాత్రం తగ్గడం లేదు.


Click it and Unblock the Notifications