For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.100కు చేరువలో

|

పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూన్ 11, శుక్రవారం) పెరిగాయి. ఒకరోజు స్థిరంగా ఉన్నప్పటికీ నేడు తిరిగి పెట్రోల్ లీటర్ పైన 29 నుండి 31 పైసలు, డీజిల్ పైన 28 పైసలు పెరిగింది. తాజా పెరుగుదలతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.95.85కి, లీటర్ డీజిల్ రూ.86.75కు చేరుకుంది. మే 4వ తేదీ నుండి ఇంధన ధరలు ఇప్పటికి 23సార్లు పెరిగాయి. ఈ కాలంలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన రూ.5.30, లీటర్ డీజిల్ పైన రూ.5.84 పెరిగింది.

ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102 దాటింది. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.100 సమీపానికి చేరుకుంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.95.85, డీజిల్ లీటర్ రూ.86.75, ముంబైలో పెట్రోల్ రూ.102.04, డీజిల్ రూ.94.15, కోల్‌కతా నగరంలో పెట్రోల్ రూ.95.80, డీజిల్ రూ.89.60, చెన్నైలో పెట్రోల్ రూ.97.19, డీజిల్ రూ.91.42, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.99.62, డీజిల్ రూ.94.57గా ఉంది.

Petrol and diesel price today: Rates breach record highs again

రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, లడక్‌లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటింది. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లాలో రూ.106.94కు చేరుకుంది. దేశంలో ఇది అత్యధికం.ఇక్కడ డీజిల్ ధర కూడా రూ.100ను సమీపించింది. మే 4వ తేదీ నుండి ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. నాటి నుండి 23సార్లు ధరలను సవరించాయి.

English summary

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.100కు చేరువలో | Petrol and diesel price today: Rates breach record highs again

Prices of Petrol and Diesel were hiked once again today, after a short one-day pause. Petrol price in Delhi today costs Rs 95.85 per litre, an increase of 29 paise. Meanwhile, the price of diesel in the capital city is retailing at Rs 86.75 pe litre today, up 28 paise since yesterday.
Story first published: Friday, June 11, 2021, 13:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X