పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం (ఏప్రిల్ 9) యథాతథంగా ఉన్నాయి. దేశీయ చమురు రంగ కంపెనీలు మార్చి నెలలో మూడుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి. ఈ మూడు పర్యాయాలు కలిసి లీటర్ పెట్రోల్ పైన 61 పైసలు, లీటర్ డీజిల్ పైన 60 పైసలు తగ్గింది. మార్చి నెల చివరి తేదీన కూడా ధరల్లో మార్పులేదు. చివరిసారి మార్చి 24వ తేదీన ధరలు తగ్గాయి. పెట్రోల్ ధరలు ఏడాది కాలంలో రూ.21.58 పెరగగా, డీజిల్ ధర రూ.19.18 పెరిగింది.

వివిధ నగరాల్లో ధరలు
దేశీయ చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరలను సవరిస్తాయి. ఏడాది కాలంగా భారీగా పెరిగిన ధరలు, గత నెలలో మాత్రం మూడుసార్లు తగ్గాయి. వివిధ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ఢిల్లీలో రూ.90.56, ముంబైలో రూ.96.98, చెన్నైలో రూ.92.58, కోల్‌కతాలో రూ.90.77గా ఉంది. లీటర్ డీజిల్ ఢిల్లీలో రూ.80.87, ముంబైలో రూ.87.96, చెన్నైలో రూ.85.88, కోల్‌కతాలో రూ.83.75గా ఉంది.

హైదరాబాద్‌లో లీటర్ రూ.94.16
పుణేలో లీటర్ పెట్రోల్ రూ.96.62, లీటర్ డీజిల్ రూ.86.27గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రూ.93.59, డీజిల్ రూ.85.75, హైదరాబాద్ పెట్రోల్ రూ.94.16, డీజిల్ రూ.88.20, నోయిడాలో పెట్రోల్ రూ.88.91, డీజిల్ రూ.81.33, మొహాలీలో పెట్రోల్ రూ.92.77, డీజిల్ రూ.83.72, గురుగ్రామ్‌లో పెట్రోల్ రూ.88.52, డీజిల్ రూ.81.45గా ఉంది.

క్రూడాయిల్ ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ బ్యారెల్‌కు 63 డాలర్ల దిగువన ట్రేడ్ అయింది. ఏప్రిల్ 8న క్రూడాయిల్ ఫ్యూచర్ బ్యారెల్‌కు రూ.4,429కి పడిపోయింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ 0.75 శాతం క్షీణించి 59.52 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బ్రెంట్ క్రూడ్ 0.3 శాతం పెరిగి 63.36 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications