Adani News: అదానీ స్టాక్ అక్రమాల్లో నిజాలు దాచిన SEBI..! సుప్రీం కోర్టులో మ్యాటర్ హీట్..
Adani News: అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానంలో నానుతోంది. ఇందులో కీలకమైన అంశాలను కావాలనే పక్కన పెట్టారంటూ వస్తున్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అత్యున్నత న్యాయస్థానం ముంచు ఉంచాల్సిన ముఖ్యమైన అంశాలను దాచిపెట్టిందని, వాటిని అటకెక్కించిందని పిటిషనర్ సుప్రీంకోర్టులో ఆరోపించారు. ఈ క్రమంలో స్టాక్ మానిప్యులేషన్‌పై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లేఖ గురించి కోర్టుకు తెలిపారు.

ఓవర్ ఇన్‌వాయిస్ కేసులో అదానీ గ్రూప్‌పై విచారణ జరుగుతుండగా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) 2014లో అప్పటి సెబీ చైర్‌పర్సన్‌కు లేఖ పంపిందని పిటిషనర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పవర్ ఎక్విప్‌మెంట్ దిగుమతిలో ఓవర్ వాల్యుయేషన్ పద్ధతిని ఉపయోగించి.. తద్వారా వచ్చిన డబ్బును ఉపయోగించి అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్‌కు పాల్పడి ఉండొచ్చని సెబీని అప్రమత్తం చేసిన విషయాన్ని కోర్టుకు వెల్లడించారు.
ఈ పద్ధతిలో అదానీ గ్రూప్ మెుత్తంగా రూ.2,323 కోట్లను స్వాహా చేసినట్లు ఆధారాలతో డీఆర్ఐ దర్యాప్తు చేస్తున్న సంగతి గురించి అఫిడవిట్లో పేర్కొన్నారు. ముఖ్యమైన వాస్తవాలు, ఆధారాలను సెబీ కోర్టు ముందు కావాలనే అణచివేసిందని పేర్కొన్నారు. DRI హెచ్చరించినప్పటికీ చర్యలు తీసుకోకుండా అప్పట్లో సెబీ నిద్రపోయిందని అన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల.. సెబీ అదానీ గ్రూప్‌పై రెండు ఆరోపణలు మినహా అన్నింటిలోనూ విచారణను పూర్తి చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలియజేసింది.


Click it and Unblock the Notifications