KTR News: గత కొన్ని నెలలుగా తెలంగాణకు వరుసగా కంపెనీలు తమ పెట్టుబడులతో రావటానికి వెనుక పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రమైన కృషి ఉంది. మెున్న గోల్డ్‌మాన్ సాచ్స్ డీల్ బ్యాంకింగ్ రంగంలో కుదరగా తాజాగా మరో పెట్టుబడిని ఆకర్షించారు.
గ్లోబల్ పెట్ ఫుడ్ మేజర్ మార్స్ ఇంక్ తెలంగాణలో తన ఫేజ్-2 విస్తరణను ప్రారంభించడానికి రూ.800 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. Petcare సంస్థ ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో 200 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్లాంట్‌ను కలిగి ఉంది. ఇక్కడ వారు పెడిగ్రీ, విస్కర్స్ వంటి ప్రసిద్ధ బ్రాండ్‌ల క్రింద పెట్ ఫుడ్‌ను తయారు చేస్తున్నారు. కంపెనీ ప్రకటించిన తాజా ప్రణాళికతో తెలంగాణలో మార్స్ ఇంక్ మెుత్తం పెట్టుబడులు రూ.200 కోట్ల నుంచి రూ.1,500 కోట్లకు చేరుకోనున్నాయి.

రూ.500 కోట్ల అదనపు పెట్టుబడితో రాష్ట్రంలో తమ తయారీ ప్లాంట్ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వంతో డిసెంబర్ 17, 2021న మార్స్ పెట్‌కేర్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత తాజా పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం న్యూయార్క్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ శుక్రవారం మార్స్ ఇంక్‌లో పెట్ న్యూట్రిషన్ చీఫ్ డేటా అండ్ అనలిటిక్స్ ఆఫీసర్ శేఖర్ కృష్ణమూర్తితో సమావేశమయ్యారు. ఈ క్రమంలో భారతదేశంలో పెంపుడు జంతువుల మార్కెట్ వేగంగా వృద్ధ చెందుతున్న తరుణంలో వ్యాపార విస్తరణకు పెట్టుబడిని కంపెనీ ప్రకటిస్తూ తెలంగాణలో తన ఆసక్తిని వెల్లడించింది.
R&D, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, అగ్రి సప్లై చెయిన్‌లు, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబిలిటీ ఏరియాలలో ఉన్న అవకాశాలపై ఈ మీటింగ్ లో చర్చించారు. ఇదిలా ఉండగా.. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ రాబోయే రెండేళ్లలో తెలంగాణలో 1000 కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. న్యూ యార్క్‌లో పెర్సిస్టెన్సిస్ CEO, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ కల్రాతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. కంపెనీ డిజిటల్ ఇంజనీరింగ్ అండ్ ఎంటర్‌ప్రైజ్ ఆధునీకరణను అందించే గ్లోబల్ సర్వీసెస్, సొల్యూషన్స్ కంపెనీ. తెలంగాణను టాలెంట్ హబ్‌గా మార్చేందుకు అవసరమైన అంశాలపై ఇందులో చర్చించారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications