పర్సనల్ లోన్స్ vs పేడే లోన్స్: ఇవి తెలియకపోతే మీ పర్స్ ఖాళీ...

ఒకప్పుడు బ్యాంకులు మాత్రమే లోన్స్ అందించేవి. అది కూడా కొన్ని షరతులు, హామీలతో. కానీ ఇప్పుడు లోన్లు చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తం వరకు ఫోన్ ద్వారా లభిస్తున్నాయి. కాలం మారుతున్న కొద్దీ మనుషుల అవసరాలకు అనుగుణంగా కూడా ఇప్పుడు లోన్ అందుబాటులో ఉన్నాయి. లోన్స్ ఎక్కువగా యూజర్-ఫ్రెండ్లీ, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. ఒకోసారి ఊహించలేని పరిస్థితులలో లోన్లు చాలా ఉపయోగపడతాయి. ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల లోన్స్ అందిస్తుంటారు, ఒకదానికి మించి ఒకటి వడ్డీ రేట్ల వల్ల పర్సనల్ లోన్ ఫస్ట్ అప్షన్ గా పరిగణిస్తారు. క్రెడిట్ కార్డ్స్ లాగా కాకుండా పర్సనల్ లోన్స్ తక్కువ వడ్డీ రేట్లు, ఎక్కువ పేమెంట్ అప్షన్స్, సింపుల్ అప్లికేషన్ ప్రాసెస్ అందిస్తాయి.

ఇప్పుడు వస్తున్న మరో రకమైన లోన్ పేడే లోన్, ఈ లోన్ తక్కువ టైంలో రీపేమెంట్, ఎక్కువ-వడ్డీతో కూడిన లోన్. సాధారణంగా తక్కువ మొత్తానికి ఎక్కువ వడ్డీ లేదా ఎక్కువ మొత్తంతో రీపేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. పర్సనల్ లోన్స్ & పేడే లోన్స్ డబ్బు అవసరమైనపుడు బెస్ట్ సొల్యూషన్ గా ఉపయోగపడతాయి. అయితే ఈ రెండు రకాల లోన్లు వాటి ఉపయోగం, లోన్ మొత్తం, రీపేమెంట్ రూల్స్, అర్హతలు చూస్తే చాల తేడా ఉంటుంది. పేడే లోన్స్ అర్జంటుగా డబ్బు అవసరమైన సమయంలో వెంటనే ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది, అయితే ఎక్కువ వడ్డీ రేట్లు, తక్కువ రిపెమెంట్ టైం ఉంటుంది. పర్సనల్ లోన్ తీసుకోవడం వల్ల తక్కువ వడ్డీ రేట్లు, సింపుల్ రీపేమెంట్ షెడ్యూల్‌, ఇబ్బంది లేకుండా డబ్బు కట్టే అప్షన్స్ అందిస్తుంది.

Personal Loans vs Payday Loans Key differences and how to choose the right one

పర్సనల్ లోన్లు ఇంటి రేనోవేషన్, పై చదువులకు చాల సురక్షితమైనది. పేడే లోన్‌లు ఇవి చాల జాగ్రత్తగా అవసరాన్ని బట్టి ఉంటాయి. "మీకు ప్రతినెల నెల జీతం, మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే పర్సనల్ లోన్ ట్రాక్ రికార్డ్ రీపేమెంట్ నిబంధనలతో పేడే ఇస్తుంటారు. పేడే లోన్‌ల అధిక వడ్డీ విషయంలో జాగ్రత్తగా వహించాలి" అని VSRK క్యాపిటల్ డైరెక్టర్ స్వప్నిల్ అగర్వాల్ అన్నారు

పర్సనల్ లోన్ vs పేడే లోన్

ఉన్నత చదువులు, ఇల్లు కొనడం, వివాహ ఖర్చుల కోసం లేదా పర్సనల్ ఖర్చుల కోసం పర్సనల్ లోన్ అనుకూలంగా ఉంటుంది. మరోవైపు, పేడే లోన్స్ తీసుకోవడం అనేది ఒక సింపుల్ ప్రాసెస్, ఎందుకంటే ఇవి తక్కువ టైంలోనే రీపేమెంట్ చేసే ఆన్ సేఫ్ లోన్స్. బ్యాంకులు, NBFCలు, డిజిటల్ బ్యాంకులు వివిధ ప్రయోజనాల కోసం పర్సనల్ లోన్స్ అందిస్తాయి. అయితే పేడే లోన్స్ మీ వచ్చే నెల జీతం వచ్చేవరకు లేదా తక్కువ టైంలోనే రీపేమెంట్ చేసేల అత్యవసర ఖర్చులను తీర్చడానికి లభించే షార్ట్ టర్మ్ లోన్. పర్సనల్ లోన్ సాధారణంగా రూ. 50,000 నుండి రూ. 25 లక్షల వరకు లోన్ అందిస్తాయి, అయితే పేడే లోన్‌లు మాత్రం రూ. 1,000 నుండి రూ. 1 లక్ష వరకు లోన్ ఫెసిలిటీ ఇస్తాయి.

వ్యక్తిగత లోన్లు పేడే లోన్ల మధ్య ఒక ముఖ్యమైన తేడా ఏంటంటే వడ్డీ రేట్లు. వ్యక్తిగత లోన్ల పై వడ్డీ రేటు లోన్ మొత్తం ఇంకా లోన్ తీసుకున్న వ్యక్తి క్రెడిట్ స్కోర్ ఆధారంగా మారవచ్చు. ఆవరేజ్ గా చూస్తే వ్యక్తిగత లోన్స్ తక్కువ వడ్డీ రేట్లతో ఉంటాయి. పేడే లోన్స్ మాత్రం ఎక్కువ వడ్డీ రేట్లతో ఉంటాయి, అంటే ఉదాహరణకి 36 శాతం నుండి 60 శాతం. పర్సనల్ లోన్ కోసం ప్రాసెసింగ్ ఫీజు మొత్తంలో 1-3% వరకు ఉంటుంది, అయితే పేడే లోన్ ఎక్కువగా ఫిక్స్డ్ లోన్ లేదా లోన్ మొత్తంలో ఎక్కువ శాతాన్ని రిటర్న్ వసూలు చేస్తుంది. పర్సనల్ లోన్ రీపేమెంట్ సాధారణంగా సెలెక్ట్ చేసుకున్న కాలవ్యవధిలో ప్రతినెలా EMIల ద్వారా చెల్లించవచ్చు, అయితే పేడే లోన్ రీపేమెంట్ సాధారణంగా నెక్స్ట్ శాలరీ లేదా తక్కువ టైంలోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+