బంగారం ఎప్పుడూ మనకు సేవింగ్స్‌కి, ఎమర్జెన్సీకి సపోర్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు అదే బంగారం, బ్యాంకులకు, NBFCలకు లాభదాయకమైన బిజినెస్ అయింది. ముతూట్ ఫైనాన్స్ ఒక్కటే మార్చి 2025 నాటికి రూ.1 లక్ష కోట్లు AUM దాటింది. RBI డేటా చూస్తే, బ్యాంకులు ఇచ్చిన బంగారం రుణాలు ఏడాదిలోనే దాదాపు డబుల్ అయ్యాయి. 2024లో రూ.1.03 లక్ష కోట్లు ఉండగా, 2025లో రూ.2.09 లక్ష కోట్లకు చేరాయి.

మనం సాధారణంగా హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ లాంటి వాటినే ఊహిస్తాం. కానీ 2025లో ఈ రేస్‌లో కొత్త హీరోగా బంగారం రుణాలు ఎంట్రీ ఇచ్చాయి. కేవలం పెరిగినట్టే కాదు, డబుల్ గ్రోత్ సాధించి, అన్ని ఇతర రిటైల్ లోన్స్‌ను వెనక్కి నెట్టేశాయి.
దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరగడం. అదే బంగారం మీద కస్టమర్లకు ఇప్పుడు ఎక్కువ లోన్ లభిస్తోంది. రెండోది, RBI పర్సనల్ లోన్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో, చాలామంది ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్ వైపు తిరుగుతున్నారు. ఫలితంగా, గోల్డ్ లోన్స్ సేఫ్, సింపుల్ ఆప్షన్‌గా మారాయి.
కస్టమర్లు ఎక్కువగా రిపీట్ బారోవర్స్ అవుతారు. ఉదాహరణకు, బంగారం ధర పెరిగిందంటే పాత రుణం క్లోజ్ చేసి, అదే ఆభరణాల మీద కొత్త రుణం తీసుకోవడం చేస్తారు. బ్యాంకులకైతే ఇది మరీ బెటర్ ఎందుకంటే రిస్క్ చాలా తక్కువ. సెక్యూర్డ్ లోన్ కాబట్టి NPA ఛాన్స్‌లు చాలా రేర్.
గోల్డ్ లోన్స్ తీసుకునే వాళ్లలో ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారాలు చేసే వాళ్లు ఉంటారు. వీళ్లు ఎక్కువగా షార్ట్ టర్మ్ ఫండ్ గ్యాప్ కోసం గోల్డ్ ని తాకట్టు పెడతారు. ఉదాహరణకి పిల్లల ఫీజులు కట్టడం, షాప్ కోసం కొత్త స్టాక్ కొనడం, లేదా ఎమర్జెన్సీ మెడికల్ ఖర్చులు తీర్చుకోవడం. ఇలా చెప్పుకుంటే ఇది కేవలం బ్యాంకింగ్ ఫిగర్స్ మాత్రమే కాదని, మన రోజువారీ జీవితంలో గోల్డ్ లోన్ ఎంత యూజ్ అవుతుందో బాగా అర్థమవుతుంది.
ఈ బంగారం రుణాల బూమ్‌లో పెద్ద బ్యాంకులు కూడా బలంగా ఆడుతున్నాయి. SBI గోల్డ్ లోన్ బుక్ ఒక్క ఏడాదిలోనే 53% పెరిగి రూ.50,000 కోట్లకు పైగా చేరింది. CSB బ్యాంక్లో గోల్డ్ లోన్స్ మొత్తం పోర్ట్‌ఫోలియోలో 44% వాటా సాధించాయి. కొత్తగా Ujjivan Small Finance Bank కూడా గోల్డ్ లోన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. అంటే ఈ రంగం ఎంత పెరుగుతోందో ఇక్కడే అర్థమవుతుంది.
2020 నుంచి 2025 వరకు గోల్డ్ లోన్స్ 44% CAGRతో పెరిగాయి. అదే సమయంలో బంగారం ధరలు 122% పెరిగాయి. అంటే ధర పెరుగుదలే రుణాలను కూడా డైరెక్ట్‌గా లిఫ్ట్ చేసింది. ఆశ్చర్యకరంగా, COVID-19 సమయంలో (FY21) బంగారం ధరలు కేవలం 3% పెరిగినా, ఉద్యోగాలు, జీతాలు తగ్గడంతో గోల్డ్ లోన్స్ మాత్రం 128% జంప్ చేశాయి.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం, బంగారం ధరలు పెరగడంతో జ్యూవెలరీ డిమాండ్ 25% తగ్గినా, గోల్డ్ లోన్స్ మాత్రం పెరిగాయి. ఎందుకంటే మనం ఆభరణాలు కొనకపోయినా, ఉన్న వాటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవడం మాత్రం ఆగలేదు. బ్యాంకులు కూడా ఈ సెక్టార్‌ను మరింతగా ప్రోత్సహిస్తున్నాయి, ఎందుకంటే ఇది సేఫ్ లెండింగ్ మోడల్.
ఫ్యూచర్‌లో గోల్డ్ లోన్స్ డిమాండ్ ఇంకాస్త పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. కానీ, బంగారం ధరలు తగ్గిపోతే లోన్ వాల్యూమ్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు, RBI తీసుకునే పాలసీలు కూడా గోల్డ్ లోన్ మార్కెట్‌పై పెద్ద ప్రభావం చూపిస్తాయి. అంటే, ఈ రంగం భవిష్యత్తు పూర్తిగా బంగారం రేట్లు, RBI నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది.
2025లో గోల్డ్ లోన్స్ రిటైల్ క్రెడిట్‌లో కొత్త డ్రైవర్‌గా అవతరించాయి. బంగారం మనకే కాకుండా బ్యాంకులకు కూడా 'సేఫ్ హేవెన్' అయిపోయింది. వచ్చే సంవత్సరాల్లో కూడా ఈ మెరుపు కొనసాగే ఛాన్స్ చాలా ఉంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications