పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్‌తో లోన్ కాలవ్యవధిని ఎలా ఎంచుకోవాలి?
మీరు ఋణము తీసుకునే ముందు ఈఎంఐలు,తిరిగిచెల్లింపు కాలవ్యవధులు మరియు మొత్తం ఋణ వ్యయాలను పోల్చి చూడండి.ప్రతి ఎంపిక మీ నెలవారి ఈఎంఐ మరియు మొత్తం తిరిగిచెల్లింపు వ్యయాన్ని ఏ విధంగా ప్రభావితం చేయగలవు అని చూపుతూ ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ వివిధ తిరిగిచెల్లింపు కాలవ్యవధులను పోల్చి చూడడములో మీకు సహాయపడుతుంది. దరఖాస్తు చేసే ముందు మీరు ఋణ మొత్తము, వడ్డీ రేటు మరియు కాలవ్యవధిని ఎంటర్ చేసి వివిధ తిరిగిచెల్లింపు సందర్భాలను పోల్చి చూడటానికి కాలవ్యవధిని మార్చవచ్చు.
స్వల్పకాలిక కాలవ్యవధి అంటే అధిక నెలవారి ఈఎంఐ కాని తక్కువ తిరిగిచెల్లింపు కాలము ఉంటుంది. దీర్ఘకాలిక కాలవ్యవధి తిరిగిచెల్లింపును మరిన్ని నెలలకు విస్తరించి మీ నెలవారి ఈఎంఐని తగ్గించవచ్చు, కాని మీరు ఎక్కువ కాలం వరకు వడ్డీ చెల్లించవచ్చు. రెండు ఎంపికలను పోల్చి చూడడం వలన మీరు ఈఎంఐ మాత్రమే కాకుండా మీ తిరిగిచెల్లింపు సామర్థ్యము ఆధారంగా కూడా ఒక కాలవ్యవధిని ఎంచుకోవచ్చు.

ముఖ్యాంశాలు
ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ తిరిగిచెల్లింపు కాలవ్యవధులను పోల్చి చూడడము మరియు నెలవారి భారము మరియు మొత్తం ఋణ వ్యయాల మధ్య సర్దుబాటును అర్థంచేసుకోవటానికి సహాయపడగలదు.
- వివిధ కాలవ్యవధులలో అంచనావేయబడిన ఈఎంఐలను పోల్చి చూచుటకు.
- కాలవ్యవధిని మార్చడం వలన మొత్తం వడ్డీ ఎలా ప్రభావితం చేస్తుంది అనేది అర్థం చేసుకొనుటకు.
- అంచనావేయబడిన ఈఎంఐ మీ నెలవారి తిరిగిచెల్లింపు సామర్థ్యానికి సరిపోతుందా అని పరీక్షించుటకు.
- స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక కాలవ్యవధులను పోల్చి చూచుటకు.
- మీ ఆదాయము, ఖర్చులు మరియు ప్రస్తుత బాధ్యతలను పరిగణించిన తరువాత ఒక కాలవ్యవధిని పరిగణించుటకు.
ఒక పర్సనల్ లోన్ తీసుకునే ముందు వివిధ సందర్భాలను పోల్చి చూడటానికి కాలిక్యులేటర్ ఒక త్వరిత విధానాన్ని ఇస్తుంది మరియు అవగాహన కలిగిన ఋణ నిర్ణయాన్ని తీసుకొనుటలో సహకరిస్తుంది.
పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ అంటే ఏమిటి?
పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ అనేది ఒక ఋణము కొరకు నెలవారి వాయిదాను అంచనావేసే ఒక ఆన్లైన్ సాధనము. ఇది సాధారణంగా మూడు అంశాలను ఉపయోగిస్తుంది: ఋణ మొత్తము, వర్తించే వడ్డీ రేటు మరియు తిరిగిచెల్లింపు కాలవ్యవధి.
అంచనావేయబడిన ఈఎంఐ మీద దాని ప్రభావము అర్థం చేసుకోవటానికి మీరు ఒకసారి ఒక అంశాన్ని మార్చి చూడవచ్చు. కాలవ్యవధులను పోల్చి చూసేటప్పుడు, ఋణ మొత్తము మరియు వడ్డీ రేటును మార్చకండి. ఇది తిరిగిచెల్లింపు కాలవ్యవధి మీ ఈఎంఐని ఎలా ప్రభావితం చేస్తుంది అనేదాని గురించి స్పష్టమైన పోలిక ఇస్తుంది.
ఉదాహరణకు,మీకు రూ.5 లక్షల మొత్తము కావాలనుకుంటే,మీరు ఆ మొత్తాన్ని మరియు వర్తించే వడ్డీ రేటును ఎంటర్ చేసి,ఆ పిమ్మట వివిధ తిరిగిచెల్లింపు కాలవ్యవధులను పోల్చి చూడవచ్చు.
కాలిక్యులేటర్ ఒక అంచనాను అందిస్తుంది. మీ అసలైన ఈఎంఐ అంతిమ ఋణ మొత్తము, వర్తించే వడ్డీ రేటు, కాలవ్యవధి మరియు ఇతర ఋణ నియమాలపై ఆధారపడి ఉంటుంది.
కాలవ్యవధిని మార్చడం ఏ విధంగా మీ ఈఎంఐని ప్రభావితం చేస్తుంది?
తిరిగిచెల్లింపు కాలవ్యవధి అనేది ఒక ఋణాన్ని తిరిగిచెల్లించుటకు మీరు తీసుకునే కాలాన్ని నిర్ణయిస్తుంది. దానిని మార్చడం వలన మీ నెలవారి ఈఎంఐ మరియు మీరు తిరిగిచెల్లించే కాలము రెండూ ప్రభావితం అవుతాయి.
స్వల్పకాలిక కాలవ్యవధి
స్వల్పకాలిక కాలవ్యవధితో మీరు ఋణాన్ని కొన్ని నెలలలోనే తిరిగిచెల్లిస్తారు. దీని వలన సాధారణంగా నెలవారి ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడ ప్రయోజనం ఏమిటంటే మీరు ఋణాన్ని తొందరగా తిరిగిచెల్లిస్తారు. వర్తించే వడ్డీ రేటు మరియు ఋణ కాలవ్యవధుల ఆధారంగా, స్వల్పకాలిక తిరిగిచెల్లింపు కాలము దీర్ఘకాలిక కాలవ్యవధితో పోలిస్తే చెల్లించే మొత్తం వడ్డీని కూడా తగ్గించవచ్చు.
దీర్ఘకాలిక కాలవ్యవధి
దీర్ఘకాలిక కాలవ్యవధి తిరిగిచెల్లింపును మరిన్ని నెలలు విస్తరిస్తుంది. దీని వలన సాధారణంగా నెలవారి ఈఎంఐ తక్కువగా ఉంటుంది.
అయితే, తిరిగిచెల్లింపు ఎక్కువ కాలం కొనసాగుతుంది కాబట్టి, చెల్లించబడే మొత్తం వడ్డీ ఎక్కువగా ఉండవచ్చు. అందువలన, తక్కువ ఈఎంఐ అంటే తక్కువ ఋణ వ్యయము అని అర్థం కాదు.
ప్రో టిప్: కాలవ్యవధులను పోల్చి చూసేటప్పుడు, అంచనావేయబడిన ఈఎంఐ మరియు మొత్తం తిరిగిచెల్లింపులు రెండిటిని చూడండి. కేవలం తక్కువ నెలవారి వాయిదా ఆధారంగా మాత్రమే ఎంపిక చేయకండి.
ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించి వివిధ కాలవ్యవధులను మీరు ఎలా పోల్చి చూడగలరు?
ఒకవేళ మీరు రూ. 5 లక్షల పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారు అనుకోండి. ఋణ మొత్తము మరియు వర్తించే వడ్డీరేటును స్థిరంగా ఉంచి తిరిగిచెల్లింపు కాలవ్యవధిని మాత్రమే మార్చండి. కాలవ్యవధి మీ అంచనావేయబడిన ఈఎంఐ మరియు తిరిగిచెల్లింపు కాలాన్ని ఎలా ప్రభావితం చేయగలదు అని అర్థంచేసుకోవడములో మీకు సహాయపడుతుంది.
వివిధ కాలవ్యవధులను మీరు ఎలా పోల్చి చూడవచ్చు అనేదానికి ఒక ఉదాహరణ:
| ఉదాహరణ కాలవ్యవధి | ఈ పోలిక వలన మీరు ఏమి అర్థంచేసుకోగలరు |
| 12-24 నెలలు | తిరిగిచెల్లింపు కాలాన్ని సంక్షిప్తంగా ఉంచుతూ ఋణాన్ని తొందరగా చెల్లించివేయడములో సహాయపడే స్వల్పకాలిక తిరిగిచెల్లింపు కాలవ్యవధి. |
| 25-48 నెలలు | నెలవారి వాయిదాలను సౌకర్యవంతంగా ప్రణాళిక చేసుకునేందుకు ఎక్కువ సమయాన్ని ఇచ్చే అనువైన తిరిగిచెల్లింపు కాలము. |
| 49-72 నెలలు | అంచనావేయబడిన నెలవారి వాయిదాలను నిర్వహించుటలో అధిక అనుకూలతను అందించగలిగే ఒక దీర్ఘకాలిక తిరిగిచెల్లింపు కాలము. |
| 73-108 నెలలు | నెలవారి తిరిగిచెల్లింపులను ప్రణాళిక చేసుకునేందుకు మరియు నిర్వహించుటకు మరింత సమయాన్ని ఇచ్చే ఒక పొడిగించబడిన తిరిగిచెల్లింపు కాలము. |
అసలైన ఈఎంఐ,చెల్లించవలసిన వడ్డీ మరియు పూర్తి తిరిగిచెల్లింపు మొత్తము అన్నీ వర్తించే వడ్డీ రేటు, ఋణ మొత్తము, కాలవ్యవధి మరియు ఇతర ఋణ నియమాలపై ఆధారపడి ఉంటాయి.
స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక కాలవ్యవధుల మధ్య మీరు ఎలా ఎంచుకోగలరు?
మీ ఎంపిక ప్రతినెల మీరు సౌకర్యవంతంగా ఎలా తిరిగిచెల్లించగలరు అనేదానిపై ఆధారపడి ఉంటుంది.ఆవశ్యకత ఖర్చులు, పొదుపులు లేదా ప్రస్తుత ఆర్ధిక బాధ్యతలపై ప్రభావం పడకుండా అధిక ఈఎంఐని మీరు నిర్వహించుకోగలిగే ఆదాయం మీకు ఉంటే స్వల్పకాలిక కాలవ్యవధి మీకు సరిపోతుంది.
నెలవారి తిరిగిచెల్లింపు తక్కువగా ఉండాలని మీరు అనుకుంటే దీర్ఘకాలిక కాలవ్యవధిని మీరు పరిగణించవచ్చు. అయితే, మొత్తం ఋణ వ్యయముపై దీర్ఘకాలిక తిరిగిచెల్లింపు కాలము యొక్క సంభావ్య ప్రభావాన్ని కూడా మీరు పరిగణించాలి.
ఎంచుకునే ముందు, వీటిని పరిగణించండి:
- నెలవారి ఆదాయము
- ప్రస్తుతం ఉన్న ఈఎంఐలు
- సాధారణ ఇంటి ఖర్చులు
- పొదుపులు మరియు ఇతర ఆర్ధిక బాధ్యతలు
- అంచనావేయబడిన కొత్త ఈఎంఐ
- మొత్తం తిరిగిచెల్లింపు బాధ్యత
మీ పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ అంకెలను పోల్చి చూడటములో మీకు సహాయపడవచ్చు, కాని మీ అసలైన ఆర్ధిక పరిస్థితితో వాటిని మీరు అంచనా వేయాలి.
కాలవ్యవధి పోలిక మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది?
అర్హత కలిగిన ప్రణాళిక చేయబడిన లేదా అత్యవసర ఖర్చు కోసం మీరు ఒక పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకున్నప్పుడు తిరిగిచెల్లింపు కాలవ్యవధులను పోల్చి చూడడం సహాయపడుతుంది.
ఉదాహరణకు, మీకు ఈ అవసరాల కోసం నిధులు అవసరం కావచ్చు:
- వైద్య అత్యవసర పరిస్థితులు
- విద్య
- పెళ్ళి ఖర్చులు
- ఇంటి పునరుద్ధరణ
- ప్రయాణము
ఒకవేళ మీకు ఇంటి పునరుద్ధరణ కోసం నిధులు కావాలని అనుకోండి. తక్కువ అంచనావేయబడిన ఈఎంఐని అందిస్తుంది కాబట్టి అందుబాటులో ఉన్న సుదీర్ఘమైన కాలవ్యవధిని ఎంచుకునే బదులు, ముందుగా వివిధ ఎంపికలను పోల్చి చూడండి. దీని వలన ఈఎంఐ మరియు తిరిగిచెల్లింపు కాలము ఎలా మారుతాయో మీరు అంచనావేయగలరు మరియు మీ ఆర్ధిక సామర్థ్యానికి సరిపోయే ఒక ఎంపికను ఎంచుకోవచ్చు.
బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ ఎందుకు ఒక సౌకర్యవంతమైన ఆర్ధిక ఎంపిక అవుతుంది?
బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ అర్హత కలిగిన వ్యక్తిగత అవసరాల కోసం ఎలాంటి తనఖా లేకుండా, వర్తించే అర్హతా ప్రమాణాలకు మరియు నియమాలకు లోబడి ఫైనాన్స్ అందించగలదు.
12 నెలల నుండి 108 నెలల వరకు ఉండే తిరిగిచెల్లింపు కాలవ్యవధులతో రూ. 40,000 నుండి రూ. 55 లక్షల వరకు ఉండే ఋణ మొత్తాలు అందించబడతాయి. వడ్డీ రేట్లు వర్తించే నియమాలు మరియు ఋణగ్రహీత ప్రొఫైల్ ఆధారంగా ఏడాదికి 10% నుండి 30.5% వరకు ఉండవచ్చు.
మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేయవచ్చు మరియు వర్తించే డాక్యుమెంటేషన్ మరియు ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. వర్తించే నియమ నిబంధనల ఆధారంగా విశేశాలలో ఉన్నవి, త్వరిత ఆమోదము, నామమాత్రపు డాక్యుమెంటేషన్ మరియు 24 గంటలలో* పంపిణి.
అందుబాటులో ఉన్న వివిధ తిరిగిచెల్లింపు కాలవ్యవధుల వలన మీరు వర్తించే ఋణ నియమాలను ఎంచుకునే ముందు మీ తిరిగిచెల్లింపు సామర్థ్యము ఆధారంగా ఎంపికలను పోల్చి చూడవచ్చు.
ఋణ కాలవ్యవధిని ఎంచుకునే ముందు మీరు పరీక్షించుకోవలసినవి ఏవి?
ఈఎంఐ అనేది ఋణ నిర్ణయములో ఒక భాగము మాత్రమే. ఒక కాలవ్యవధిని ఎంచుకునే ముందు, పూర్తి వ్యయాన్ని మరియు వర్తించే నియమాలను సమీక్షించండి.
పరీక్షించండి:
- వర్తించే వడ్డీ రేటు
- అంచనావేయబడే ఈఎంఐ
- పూర్తి తిరిగిచెల్లింపు మొత్తం
- తిరిగిచెల్లింపు కాలవ్యవధి
- ప్రాసెసింగ్ చార్జీలు మరియు ఇతర వర్తించే చార్జీలు
- ప్రస్తుతం ఉన్న ఆర్ధిక బాధ్యతలు
- మీ తిరిగిచెల్లింపు సామర్థ్యము
దరఖాస్తు చేసే ముందు మీరు వర్తించే అర్హతా ప్రమాణాలు మరియు అవసరమైన దస్తావేజులను కూడా పరీక్షించాలి.
అంతిమ ఋణ మొత్తము, వడ్డీ రేటు, కాలవ్యవధి మరియు ఇతర నియమాలు అన్నీ అంచనా మరియు వర్తించే పరిస్థితులకు లోబడి ఉంటాయి.
ప్రో టిప్: నిత్య ఖర్చులు మరియు అనుకోని ఖర్చుల కొరకు మీ నెలవారి బడ్జెట్ లో తగిన ఏర్పాటు ఉంచండి. తిరిగిచెల్లింపు ప్రణాళిక ఋణ కాలవ్యవధి అంతా నిర్వహించదగినదిగా ఉండాలి.
దరఖాస్తు చేసే ముందు ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ను మీరు ఎలా ఉపయోగించగలరు?
వివిధ కాలవ్యవధులను మీరు కొన్ని సులభమైన దశలలో పోల్చి చూడవచ్చు:
1.కావలసిన ఋణ మొత్తాన్ని ఎంటర్ చేయండి.
2.వర్తించే వడ్డీ రేటును ఎంటర్ చేయండి.
3.తిరిగిచెల్లింపు కాలవ్యవధిని ఎంపిక చేయండి.
4.అంచనావేయబడిన ఈఎంఐని వ్రాసుకోండి.
5.ఇతర అంశాలను స్థిరంగా ఉంచుతూ కాలవ్యవధిని మార్చండి.
6.అంచనావేయబడిన ఈఎంఐ మరియు మొత్తం తిరిగిచెల్లింపును పోల్చి చూడండి.
7.ఇతర అందుబాటులో ఉండే కాలవ్యవధులతో ప్రక్రియను మళ్ళీ చేయండి.
ఈ విధానము ఒక పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేసే ముందు వివిధ తిరిగిచెల్లింపు కాలాల ఆర్ధిక ప్రభావాన్ని అర్థం చేసుకోవడములో సహాయపడుతుంది.
ఎంపికలను మీరు పోల్చి చూసిన తరువాత, మీరు వర్తించే అర్హత ప్రమాణాలను పరీక్షించవచ్చు, ఋణ నియమాలను సమీక్షించండి మరియు ఋణము తీసుకునే ఎంపిక మీ ఆర్ధిక అవసరాలకు సరిపోతుందా అనేది నిర్ణయించుకోండి.
తిరిగిచెల్లింపు కాలము మీ అంచనావేయబడిన ఈఎంఐని మరియు మొత్తం తిరిగిచెల్లింపు వ్యయాన్ని ఎలా ప్రభావితం చేయగలదు అని చూపడం ద్వారా వివిధ కాలవ్యవధులను పోల్చి చూడటానికి ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ మీకు సహాయపడుతుంది. స్వల్పకాలిక కాలవ్యవధి అంటే అధిక నెలవారి చెల్లింపులు, కాగా దీర్ఘకాలిక కాలవ్యవధి నెలవారి ఈఎంఐని తగ్గించవచ్చు కాని తిరిగిచెల్లింపు కాలాన్ని పొడిగించవచ్చు
మీరు ఎంచుకునే ముందు, వివిధ కాలవ్యవధులను పోల్చి చూడండి మరియు మీ ఆదాయము, ఖర్చులు, ప్రస్తుత బాధ్యతలు మరియు తిరిగిచెల్లింపు సామర్థ్యాలతోపాటు ఈ ఫలితాలను సమీక్షించండి.
మీరు ఒక బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ గురించి ఆలోచిస్తూ ఉంటే,మీ అర్హతను పరీక్షించండి,కాలిక్యులేటర్ ఉపయోగించి అందుబాటులో ఉన్న తిరిగిచెల్లింపు ఎంపికలను పోల్చి చూడండి, వర్తించే నియమాలను సమీక్షించండి మరియు ఒకవేళ ఋణము మీ ఆర్ధిక అవసరాలకు తగినది అయితే ఆన్లైన్ లో దరఖాస్తు చేయండి.
*షరతులు వర్తిస్తాయి


Click it and Unblock the Notifications
