Individual Tax Vs Corporate Taxes: దేశంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఆదాయపు పన్నుల వ్యవహారం కొత్త ప్రశ్నలకు దారితీస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనూ లేని స్థాయిలో ఇవి ఉన్నాయనే విషయాన్ని గణాంకాలు అక్షరాలా లెక్కలతో సహా ఫ్రూవ్ చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు ఏకంగా కార్పొరేట్ కంపెనీలు చెల్లిస్తున్న టాక్సుల కంటే అధికంగా ఉండటం ప్రభుత్వం పాటిస్తున్న పద్ధతులకు అద్ధం పడుతోంది. దీనిపై నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలతో పోల్చినప్పుడు ఇండియాలో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు భారీ రేటును కలిగి ఉన్నదనే విషయం ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ మందగమనానికి పరోక్షంగా ఇదొక కారణనే వాదనలు కూడా ఉన్నాయి.

గడచిన కొన్ని ఆర్థిక సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ4.92 లక్షల కోట్లుగా ఉండగా కార్పొరేట్ టాక్స్ వసూళ్లు రూ.5.56 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2021-22లో వ్యక్తుల నుంచి వసూలు చేసిన పన్నులు రూ.6.96 లక్షల కోట్లుగా ఉండగా.. కార్పొరేట్ పన్నులు రూ.7.12 లక్షల కోట్లుగా నివేదించబడింది. 2022-23లో రెండు దాదాపు సమాంతరం అయ్యాయి. ఈ క్రమంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.8.33 లక్షల కోట్లుగా ఉండగా, కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.8.25 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక్కడ తొలిసారిగా కార్పొరేట్ పన్ను వసూళ్లను వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు అధిగమించాయి.
ఇదే క్రమంలో 2023-24కి అంచనాలను పరిశీలిస్తే వ్యక్తిగత ఆదాయపు పన్నుల విషయంలో రూ.11.56 లక్షల కోట్లుగా ఉండగా, కార్పొరేట్ పన్ను వసూళ్ల అంచనా రూ.10.42 లక్షల కోట్లుగా నివేదించబడింది. దేశంలోని దాదాపు 2 శాతం వ్యక్తుల నుంచి ఇంత స్థాయిలో వ్యక్తిగత పన్నుల వసూళ్లు జరుగుతున్నాయి. ఇవి సరిపోవన్నట్లుగా మోదీ సర్కార్ కొత్త టాక్స్ రీజిమ్ ప్రవేశపెట్టడం ద్వారా వ్యక్తుల నుంచి పన్ను వసూళ్లను మరింతగా పెంచాలని చూస్తోన్న సంగతి తెలిసిందే.
అసోచాం ఆందోళనలు..
అనేక సంవత్సరాలుగా కార్పొరేట్ టాక్స్ రేట్లు తగ్గుతున్నాయని.. అయితే ఇది పర్సనల్ టాక్స్ రేట్లతో పోల్చినప్పుడు అంతరాన్ని భారీగా పెంచుతోందని అసోచామ్ ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న సాధారణ కార్పొరేట్ పన్ను రేటు 25.17%తో పోలిస్తే.. వ్యక్తుల కోసం అత్యధిక ఉపాంత రేటు ఇప్పుడు అత్యధిక స్లాబ్‌లో 42.74%, కొత్త పన్ను విధానంలో 39%కి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత పన్ను రేట్లలో ఇదే విధమైన తగ్గింపు అత్యవసరంగా అసోచామ్ పేర్కొంది. కార్పొరేట్ పన్నుల మాదిరిగానే వ్యక్తిగత పన్నుల్లో కోతలు ఆవస్యకమని సూచించింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications