గూగుల్‌కు గట్టి పోటీ.... గూగుల్ క్రోమ్‌ను $34.5 బిలియన్ బిడ్ చేసిన పర్ప్లెక్సిటీ AI

ప్రపంచ టెక్ రంగాన్ని ఆశ్చర్యపరిచేలా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ పెర్ప్లెక్సిటీ AI, ఆల్ఫబెట్‌కి చెందిన గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను కొనుగోలు చేయడానికి $34.5 బిలియన్ (సుమారు రూ. 2.88 లక్షల కోట్లు) నగదు బిడ్ ప్రకటించింది. ఈ మొత్తం పెర్ప్లెక్సిటీ తన విలువ కంటే రెండింతలకు పైగా ఉండటం విశేషం. AI ఆధారిత సెర్చ్ పోటీలో ఆధిక్యం సాధించడానికి కోట్లాది క్రోమ్ యూజర్లను ఆకర్షించడం ఈ బిడ్ వెనుక ప్రధాన ఉద్దేశం.

Perplexity AI Google Chrome acquisition bid 34 5 billion offer Chromium open source AI search competition US antitrust case Google monopoly Funding sources OpenAI Yahoo interest DuckDuckGo valuation estimate AI 34 5 AI OpenAI Yahoo

పెర్ప్లెక్సిటీ AI వ్యవస్థాపకుడు మరియు CEO అరవింద్ శ్రీనివాస్, పెద్ద పెద్ద వ్యాపార ఆఫర్లతో ఇప్పటికే వార్తల్లో నిలిచారు. ఈ సంవత్సరం జనవరిలో, అమెరికాలో టిక్ టాక్ పై ఉన్న "చైనీస్ యాజమాన్యం" గురించి వచ్చిన ఆందోళనలను తగ్గించేందుకు, టిక్ టాక్ USతో కలిసిపోవాలని ఒక ప్రతిపాదన పెట్టారు. అంటే, ఇద్దరూ ఒకే కంపెనీలా కలిసి పనిచేయాలని సూచించారు, దాంతో యాజమాన్యంపై ఉన్న భయాలు తగ్గుతాయని భావించారు. ఆ డీల్ సాధ్యం కాలేదు కానీ టెక్ రంగంలో పెర్ప్లెక్సిటీ ధైర్యవంతమైన అడుగులు వేసే సంస్థగా గుర్తింపు పొందింది.

గూగుల్ క్రోమ్‌ను కొనుగోలు చేయాలనే ఆసక్తి OpenAI, Yahoo, ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ వంటి సంస్థల్లో కూడా ఉంది. అమెరికా న్యాయశాఖ (DOJ) గూగుల్‌పై ఒక కేసు వేసింది. అందులో, గూగుల్ తన సెర్చ్ మార్కెట్‌లో అన్యాయంగా ఆధిపత్యం చెలాయిస్తోందని గత ఏడాది అమెరికా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తర్వాత, గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను అమ్మాలని ప్రభుత్వం కోరుతోంది.

అయితే, గూగుల్ క్రోమ్‌ను అమ్మేందుకు ఎటువంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది. అంతేకాక, గత ఏడాది ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేస్తామని తెలిపింది.

పెర్ప్లెక్సిటీ ఇప్పటివరకు Nvidia, సాఫ్ట్ బ్యాంక్ వంటి ఇన్వెస్టర్ల నుంచి $1 బిలియన్ కలిసి చెలామణీ చేసింది. ప్రస్తుతం కంపెనీ విలువ $14 బిలియన్ మాత్రమే ఉన్నప్పటికీ, కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు మొత్తం $34.5 బిలియన్ డీల్‌కి అవసరమైన నిధులను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.

పెర్ప్లెక్సిటీ, క్రోమ్ ను కొనుగోలు చేసిన తర్వాత క్రోమియం కోడ్‌ను ఓపెన్ సోర్స్‌గా కొనసాగిస్తామని, అలాగే రెండు సంవత్సరాల్లో $3 బిలియన్ పెట్టుబడి పెడతామని తెలిపింది. అదనంగా, క్రోమ్ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌ను మార్చకుండా, యూజర్లకు ఉన్న ఎంపికలను కాపాడుతూ, భవిష్యత్‌లో పోటీపై ఉండే ఆందోళనలను తగ్గిస్తామని హామీ ఇచ్చింది. ఈ ఆఫర్ పూర్తిగా నగదు రూపంలోనే ఉండగా, ఎటువంటి ఈక్విటీ భాగస్వామ్యం ఉండదని పెర్ప్లెక్సిటీ స్పష్టం చేసింది.

ప్రస్తుతం AI ఆధారిత చాట్‌బాట్‌లు ChatGPT, Perplexity వంటి వాటిని పెద్ద సంఖ్యలో యూజర్లు ఉపయోగిస్తున్నారు. దీంతో వెబ్ బ్రౌజర్లు మళ్లీ సెర్చ్ ట్రాఫిక్ మరియు యూజర్ డేటా కోసం కీలక ద్వారాలుగా మారాయి. పెర్ప్లెక్సిటీ వద్ద ఇప్పటికే "Comet" అనే AI బ్రౌజర్ ఉంది. అయితే, క్రోమ్ ‌ను కొనుగోలు చేస్తే, దాని 3 బిలియన్లకు పైగా యూజర్లను చేరుకోవచ్చు. ఇది OpenAI వంటి పోటీదారులతో సమాన స్థాయిలో నిలబడటానికి సహాయపడుతుంది.

గూగుల్ తన క్రోమ్ బ్రౌజర్‌లో AI-జెనరేటెడ్ సెర్చ్ సమ్మరీలు వంటి ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇవి సెర్చ్ మార్కెట్ షేర్‌ను కాపాడుకోవడంలో కీలకం. అందువల్ల, విశ్లేషకులు గూగుల్ క్రోమ్ ను విక్రయించే అవకాశం చాలా తక్కువ అంచనా వేస్తున్నారు.

గూగుల్ యాంటీట్రస్ట్ కేసులో ఫెడరల్ జడ్జి అమిత్ మెహతా ఈ నెలలో తుది నిర్ణయం ఇవ్వనున్నారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆయన తక్షణమే క్రోమ్ విక్రయం ఆదేశించే అవకాశం తక్కువ. ఈ కేసు DC సర్క్యూట్ కోర్ట్ వరకు వెళ్లి, ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా చేరే అవకాశం ఉంది. దాంతో ఈ ప్రక్రియ రెండు సంవత్సరాలకు పైగా సాగవచ్చు.

డక్ డక్ గో CEO గాబ్రియెల్ వెయిన్‌బర్గ్ అభిప్రాయం ప్రకారం, గూగుల్ క్రోమ్ ను తీసుకోవాల్సి వస్తే, దాని విలువ కనీసం $50 బిలియన్ ఉండవచ్చని అంచనా. ఇది పెర్ప్లెక్సిటీ ప్రతిపాదించిన $34.5 బిలియన్ కంటే చాలా ఎక్కువ. ఇది సాధ్యమైతే, టెక్ పరిశ్రమలోనే కాక, AI సెర్చ్ రేసులో కూడా గేమ్-చేంజర్ గా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. కానీ న్యాయపరమైన అడ్డంకులు, గూగుల్ వ్యూహాత్మక ప్రయోజనాలు దృష్ట్యా, ఈ డీల్ వెంటనే జరగే అవకాశం చాలా తక్కువ.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+