Food Offer: రూపాయికే ఎగ్ రైస్, రూ.2 లకు ఎగ్ నూడుల్స్, గోబీ మంచురియా..!
జనాలు ఎక్కడైనా ఫ్రీ అనే పదం వింటే ఎగబడతారు. దీన్నే చాలా మంది పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు. ఫ్రీ జనం ఎగబడతారని.. దీంతో ఉచిత పబ్లిసిటీ వస్తుందని ఇలా చేస్తున్నారు. తాజా నంద్యాలలో ఉచితం కాకుండా రూపాయికే ఎగ్ రైస్, రెండు రూపాయలకే ప్లేట్ గోపీ మంచురియా అని ప్రకటించారు. దీంతో జనాలు ఎగబడడం అది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. డేనియల్ పురంలో ఉన్న లక్కీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆఫర్ ప్రకటించారు. రూ.1 లకు ఎగ్ రైస్, రూ.2 లకు ఎగ్ నూడుల్స్, రూ.2 లకు గోబీ మంచురియా అని ప్రకటించారు.
సోషల్ మీడియాలో తెగ పబ్లిసిటీ చేసుకున్నారు. దీంతో నంద్యాలలో దాదాపు అందరికి ఈ ఆఫర్ గురించి తెలిసిపోయింది. సోమవారం రోజు లక్కీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు చాలా మంది అక్కడికి చేరుకున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభించి కౌంటర్ ఓపెన్ చేయగానే ప్రజలు పెద్ద ఎత్తున దూసుకొచ్చారు. చాలా మంది రూపాయి చెల్లించి ఎగ్ రైస్, రూ.2 చెల్లించి గోబీ, ఎగ్ నూడుల్స్ కొనుగోలు చేశారు. దీంతో రెండు గంటల్లోనే ఎగ్స్, న్యూడుల్స్, రైస్ అయిపోయాయి. అయితే నిర్వాహకులు ప్రకటనల కోసం డబ్బులు చెల్లించే బదులుగా.. తక్కువ ధరకే ఫుడ్ అందించాలని నిర్ణయం తీసుకుని ఇలా చేసినట్లు తెలుస్తోంది.

ఇలా వారికి మంచి పబ్లిసిటీ వచ్చిందని అనుకోవచ్చు. నాలుగు రోజులు కింద ఇటు హనుమకొండలో కూడా ఇలాంటి సన్నివేశమే కనిపించింది. ఇక్కడ ఏకంగా బిర్యానీ ఉచితమని ప్రకటించడంతో భారీగా జనాలు వచ్చారు. హనుమకొండ కేయూ క్రాస్‌రోడ్డు వద్ద నూతనంగా ప్రారంభమైన సురభి ఫుడ్ కోర్టు వారు ఉచిత బిర్యానీ ప్యాకెట్ల పంపిణీ చేస్తామని చెప్పారు. ఫుడ్ కోర్ట్ ప్రారంభం సందర్భంగా ఈ ప్రకటన చేశారు. అయితే వీళ్లు 300 బిర్యానీ ప్యాకెట్లు ఇస్తామనని ముందుగానే ప్రకటించారు. దీంతో ఎక్కడ బిర్యానీ ప్యాకెట్ మిస్ అవుతుందోనని జనాలు ఎగబడ్డారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ కాసేపు తోపులాట చోటుచేసుకోగా పలువురు మహిళలు స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది. అయితే ఇలాంటి ఉచితాలు ప్రకటించినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టంట్లు చేసినా.. అక్కడ ఫుడ్ బాకాలేకుంటే ఎవరు వెళ్లారు. ఎవరైనా క్వాలిటీ మెయింటెన్ చేస్తేనే కస్టమర్లు వస్తారని గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications