Gold Return: పెట్టుబడి పెట్టే విషయంలో సమయాన్ని అస్సలు వృధా చేయకూడదు. బంగారం ఎంత విలువైన లోహమో మనందరికీ తెలిసిందే. దానిని పెట్టుబడి సాధనంగా వినియోగించిన వారు ఎలా కోటీశ్వరులుగా మారారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆగస్టు 15న దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. అయితే 1947లో దేశానికి ఫ్రీడమ్ వచ్చినప్పుడు 76 ఏళ్ల కిందట పెట్టుబడులపై అవగాహన ఉన్న వారు అనేక రెట్లు లాభాలను పొందారు. ఈ క్రమంలో బంగారం 66,475% విపరీతమైన రాబడిని అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా బంగారం 15 శాతం రాబడిని ఇవ్వగలని నిపుణులు చెబుతున్నారు.

అసలు మనకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు బంగారం రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం, క్విట్ ఇండియా ఉద్యమం' ఉధృతంగా ఉన్న సమయంలో బంగారం ధర 10 గ్రాములు రూ.44గా ఉంది. అయితే 1947లో ఇడి రెండింతలై రూ.88.62కి చేరుకుంది. ఆ తర్వాత 1964లో క్షీణించి రూ.63.25కి చేరుకుంది. అయితే 1970 నుంచి ధరలు పుంజుకుని 10 గ్రాముల బంగారం ధర రూ.184కి చేరింది. 1975లో రూ.540కి, 1980లో రూ.1,333కి, 1985లో రూ.2,130, 1990లో రూ.3,200కి, 2000లో 10 గ్రాముల బంగారం ధర రూ.4,400గా ఉన్నాయి.

2005-2010 మధ్య కాలంలో బంగారం ధర విపరీతమైన పెరుగుదలను నమోదు చేసి రూ.7,000 నుంచి రూ.18,500కి పెరిగింది. 2020లో ధర 10 గ్రాములు రూ.48,651కి చేరుకోగా ప్రస్తుతం మార్కెట్లో బంగారం 10 గ్రాముల ధర రూ.59,000గా ఉంది. అయితే కొద్ది నెలల కిందట 10 గ్రాముల బంగారం ధర గరిష్ఠంగా రూ.62,000 మార్కును అందుకుంది. ఈ క్రమంలో ఎవరైన వ్యక్తి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో లక్ష రూపాయలు పెట్టుబడిగా కొనుగోలు చేసి ఇప్పటి వరకు వారివద్దే ఉంచుకున్నట్లయితే మార్కెట్ విలువ ప్రకారం దాని ధర రూ.6.65 కోట్లుగా ఉండేది. బంగారం ధరలు ఈ క్రమంలో 665 రెట్లు రాబడిని అందించాయి.


Click it and Unblock the Notifications