2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో పలువురు బ్యాంకులకు పరుగెత్తగా, మరికొందరు పెట్రోల్ బంకులు, ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా తమ వద్దనున్న నోట్లను మార్చుకునేందుకు పరుగులు తీస్తున్నారు. తాజాగా మరో విషయం బయటకొచ్చింది.
దాదాపు నాలుగింట మూడొంతుల మంది భారతీయులు.. ఇటీవల ఉపసంహరించుకున్న 2000 రూపాయల నోట్లను చిన్న డినామినేషన్లకు మార్చుకోవడం లేదట. అందుకు బదులుగా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడాన్ని ఎంచుకుంటున్నారనీ, ఈ ధోరణి వల్ల డిపాజిట్లు పెరిగే అవకాశం ఉందని బ్యాంకర్లు తెలిపారు.

ప్రతిసారి కేవలం 20 వేల వరకు మాత్రమే మార్పిడికి అనుమతి ఉంది. అయితే నోట్లను డిపాజిట్ చేయడానికి మాత్రం పరిమితి లేదు. పైగా దీనిపై వడ్డీ సైతం లభిస్తుండటంతో బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ప్రజలు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. చెలామణిలో ఉన్న 2 వేల నోట్ల విలువ 3.6 ట్రిలియన్ రూపాయలు అని RBI తెలపగా.. 6 ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మొత్తం 80 శాతం జమ అయ్యాయని బ్యాంకర్లు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
మే 23న ఈ కసరత్తు ప్రారంభించినప్పటి నుంచి మొదటి వారంలోనే సుమారు 170 బిలియన్ రూపాయలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద డిపాజిట్ అయినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇందులో 140 బిలియన్లు అంటే 82% ఖాతాల్లో జమ కాగా, మిగిలినవి మార్చుకున్నట్లు వెల్లడించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు సైతం 80-90 శాతం డిపాజిట్ చేసినట్లు చెప్పారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications