ఆధార్.. ఇది మన దేశంలో ప్రతి వ్యక్తి కలిగి ఉండాల్సిన గుర్తింపు కార్డు. ఆధార్ కార్డు లేదంటే.. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు కూడా. అంతగా ఇది మన జీవితాల్లోకి చొచ్చుకుని వచ్చేసింది. ఇక ఇల్లు మారినప్పుడల్లా ఆధార్, ఓటర్ ఐడి తదితర గుర్తింపు కార్డుల్లో అడ్రెస్ కూడా మార్చుకోవడం తప్పనిసరి.
అయితే మిగతా గుర్తింపు కార్డుల సంగతేమోగానీ.. ఆధార్ కార్డు వివరాలు మాత్రం ఇకమీదట ఎప్పుడుపడితే అప్పుడు, ఎన్నిసార్లంటే అన్నిసార్లు మార్చుకోవడం కుదరదు. ఈ మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.

ఆధార్‌లో వాటిని మార్చుకోలేరు...
ఆధార్ వివరాలు మార్చుకోవడానికి సంబంధించి ఇప్పుడు కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయి. పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు మార్చుకోవడాన్ని యూఐడీఏఐ తాజాగా నిషేధించింది. అంటే ఇక మీదట మీరు మీ ఆధార్ వివరాలలో మీ పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వాటిని మార్చుకోవడం వీలుకాదు.

కొన్ని రెండుసార్లు.. మరికొన్ని ఒక్కసారే...
యూఐడీఏఐ తాజా నిబంధనల ప్రకారం.. ఎవరైనా సరే తమ ఆధార్ కార్డులో ఉన్న వారి పేరును కేవలం రెండుసార్లు మాత్రమే మార్చుకోవడానికి ఆస్కారముంది. ఆ తరువాత తప్పు ఉన్నా మార్చుకోవడం కుదరదు. అలాగే లింగం ( స్త్రీ, పురుష), పుట్టిన తేదీ వంటి వివరాలనైతే కేవలం ఒకే ఒక్కసారి మార్చుకోగలిగే వీలుంది.

పుట్టిన తేదీ మార్చుకోవాలంటే అది తప్పనిసరి...
ఆధార్ వివరాల్లో పుట్టిన తేదీ మార్చుకోవాలంటే మాత్రం.. దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అవసరం. ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకపోతే మీరు మీ పుట్టిన తేదీని మార్చుకోవడం కుదరదు.

అవి మాత్రం ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా...
ఇక ఆధార్ వివరాలలో అడ్రెస్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్, బయోమెట్రిక్స్ వంటి వివరాల మార్పు విషయానికొస్తే.. వీటిని ఇదివరకటి మాదిరిగానే ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. దీనికోసం ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా చూపించాల్సిన అవసరం లేదు. అలాగే ఆధార్ కార్డుపై మీ ఫొటోను కూడా ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు.

ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్...
ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లోగాని లేదా ఆఫ్‌లైన్‌లోగాని మార్చుకోవచ్చు. లేదంటే సమీపంలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి కూడా వివరాలు మార్చుకోవచ్చు. అయితే ఆధార్ సెంటర్‌లో వివరాలను మార్చుకోవాలనుకుంటే మాత్రం రూ.50 ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. దీనికి జీఎస్టీ అదనం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications