5 శాతం వడ్డీకే రూ.3 లక్షలు రుణం.. ఎలాంటి గ్యారెంటీ అక్కర్లేదు.. పూర్తి వివరాలు
PM Vishwakarma Scheme: దేశంలో చేతి వృత్తుల పనుల్లో ఉన్న అనేక మంది ప్రజల రుణ అవసరాలను తీర్చేందుకు వీలుగా ప్రధాని మోదీ అతిపెద్ద స్కీమ్ ప్రకటించారు. పీఎం విశ్వకర్మ పథకం ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్కీమ్ కింద హస్తకళాకారులకు, చేతివృత్తుల వారికి వివిధ ప్రయోజనాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ముందుగా పథకం కింద పీఎం విశ్వకర్మ సర్టిఫికేట్, ఐడి కార్డ్ ద్వారా వారిని గుర్తిస్తారు. రోజుకు రూ.500 స్టైఫండ్‌తో 5-7 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ప్రాథమిక నైపుణ్య శిక్షణ ప్రారంభంలో ఈ-వోచర్ రూపంలో రూ.15,000 వరకు టూల్‌కిట్ ప్రోత్సాహకం కూడా అందించబడుతుంది.

స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే ఎలాంటి పూచీ లేకుండానే అర్హులకు రూ.3 లక్షల వరకు రుణాన్ని అందిస్తారు. ఈ మెుత్తాన్ని రెండు విడతలుగా అందిస్తారు. దీనికి 18 నుంచి 30 నెలల కాలానికి 5 శాతం వడ్డీ రేటుతో రూ.లక్ష, రూ.2 లక్షల చొప్పున రెండు వాయిదాలలో రుణం ఇవ్వబడుతుంది. స్కీమ్ ఏకంగా 18 వివిధ రకాల చేతివృత్తుల్లో ఉండే కళాకారులకు అర్హత కలిగిస్తోంది. వడ్రంగి పనిచేసే వారి నుంచి చేపలు పట్టే వారి వరకు అనేక చిన్న వృత్తుల వారిని స్కీమ్ కవర్ చేస్తోంది.
ఎవరైనా స్కీమ్ కింద తమ అర్హతను తెలుసుకునేందుకు పూర్తి సమాచారం తెలుసుకోవటానికి pmvishwakarma.gov.inని సందర్శించవచ్చు. పథకానికి సంబంధించిన ఏదైనా సమాచారం కోసం హస్తకళాకారులు, కళాకారులు 18002677777కు కాల్ చేయవచ్చు లేదా [email protected]కు ఈ-మెయిల్ పంపవచ్చు.


Click it and Unblock the Notifications