దేశంలో ఆన్ లైన లావాదేవీలు వేగంగా పెరుగుతోన్నాయి. దీనితో పాటు సైబర్ మోసాల కేసులు కూడా భారీగా పెరుగుతోన్నాయి. దీంతో భారతీయులు వేల కోట్ల రూపాయల నష్టపోతున్నారు. ఈ ఏడాది మొదటి 4 నెలల్లోనే దేశంలో 7 లక్షలకు పైగా సైబర్ మోసాల కేసులు నమోదయ్యాయి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వివరాల ప్రకారం ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే సైబర్ మోసం కారణంగా భారతీయులు వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశారు.
జనవరి 2024 నుంచి ఏప్రిల్ వరకు ఉన్న డేటా ప్రకారం వివిధ సైబర్ మోసాల కేసుల కారణంగా భారతీయ ప్రజలు రూ. 1,750 కోట్లకు పైగా నష్టపోయారు. ఈ కాలంలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో 7 లక్షల 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రకారం, మే నెలలో ప్రతిరోజూ సగటున 7 వేల సైబర్ నేరాల ఫిర్యాదులు అందుతున్నాయి. అందులో 85 శాతం ఫిర్యాదులు ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు సంబంధించినవే ఉన్నాయి.

సైబర్ క్రైమ్‌ల వార్షిక గణాంకాలను పరిశీలిస్తే గత 5 సంవత్సరాలలో సైబర్ క్రైమ్ కేసులు భారీగా పెరుగుతోన్నాయి. 2019లో కేవలం 26 వేల 49 సైబర్ నేరాలు మాత్రమే నమోదయ్యాయి. 2020లో ఈ సంఖ్య 2 లక్షల 57 వేల 777కి పెరిగింది. ఆ తర్వాత సైబర్ నేరాల కేసులు 2021లో 4 లక్షల 52 వేల 414కి, 2022లో 9 లక్షల 66 వేల 790కి పెరిగాయి. గతేడాది సైబర్ క్రైమ్ కేసులు 15 లక్షలు దాటాయి. మొత్తం సంఖ్య 15 లక్షల 56 వేల 218కి చేరింది. ఇక ఈ ఏడాది కేవలం 4 నెలల్లోనే 7 లక్షల 40 వేల 957 కేసులు నమోదయ్యాయి.
ముఖ్యంగా ట్రేడింగ్ స్కామ్‌లలో ప్రజలు గరిష్టంగా రూ.1,420 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నారు. ఈ ఏడాది మొదటి 4 నెలల్లో 20,043 వ్యాపార మోసాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఈ కాలంలో 4,599 డిజిటల్ అరెస్ట్ కేసుల్లో ప్రజలు రూ.120 కోట్ల నష్టాన్ని చవిచూశారు. పెట్టుబడి మోసాల కారణంగా రూ.222 కోట్లు, డేటింగ్ యాప్‌ల కారణంగా రూ.13.23 కోట్లు ప్రజలు నష్టపోయారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications