ఇందిరా గాంధీ పింఛను పథకాల పేరు మార్పు.. మోదీ ప్రభుత్వం పెట్టిన కొత్త పేర్లు ఇవే..

Pension Scheme Update: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దేశీయ సామాజిక భద్రతా రంగానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలను ఆమోదించింది. ఇందులో భాగముగా, నిరుపేదలకు ప్రాథమిక జీవనాధారాన్ని అందించే ప్రతిష్టాత్మక జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని (NSAP) రాబోయే ఐదేళ్లపాటు.. అంటే 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ప్రక్రియలో భాగంగా పథకం పేరుతో పాటు దాని ఉప-పథకాల పేర్లలో కేంద్రం విప్లవాత్మక మార్పులు చేసింది.

పేర్ల మార్పు - కొత్త వివరాలు:
ఇప్పటివరకు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమంగా పిలవబడే ఈ సమగ్ర పథకానికి 'ప్రధాన మంత్రి సామాజిక సహాయ యోజన' అని నూతన నామకరణం చేశారు. అదేవిధంగా, దీని పరిధిలో ఉన్న మూడు ప్రధాన పింఛను పథకాల నుండి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరును తొలగించారు.

1. ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను పథకం ఇకపై 'ప్రధానమంత్రి వృద్ధాప్య పింఛను పథకం' గా పిలువబడుతుంది.
2.ఇందిరా గాంధీ జాతీయ వితంతు పింఛను పథకం పేరును 'ప్రధానమంత్రి వితంతు పింఛను పథకం'గా మార్చారు.
3. ఇందిరా గాంధీ జాతీయ వికలాంగుల పింఛను పథకంని ఇకపై 'ప్రధానమంత్రి దివ్యాంగజన్ పెన్షన్ పథకం' గా సవరించారు.

Modi government pension schemes Indira Gandhi pension scheme renamed pension scheme latest news three pension schemes renamed National Social Assistance Programme NSAP renamed Pradhan Mantri Samajik Sahayata Yojana old age pension scheme India widow pension scheme disability pension eligibility pension scheme October 2026 Cabinet decision pension schemes 53428 crore social assistance scheme

గతంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పేరును 'విక్సిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్)' గా మార్చిన కేంద్రం.. ఇప్పుడు పెన్షన్ పథకాల నుంచి కూడా మాజీ ప్రధాని పేరును తొలగించడం గమనార్హం.

Also Read

రూ. 53,428 కోట్ల కేటాయింపు - 3.2 కోట్ల మందికి ప్రయోజనం:
ఈ ఐదేళ్ల పొడిగింపు కాలానికి గాను ప్రభుత్వం రూ. 53,428 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. దేశవ్యాప్తంగా సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన, దిగువ వర్గాలకు చెందిన సుమారు 3.2 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఈ నిర్ణయం ద్వారా నేరుగా ప్రతి నెలా ఆర్థిక సహాయాన్ని పొందనున్నారు.

దివ్యాంగుల పింఛన్ నిబంధనలలో విప్లవాత్మక సవరణలు:
దివ్యాంగుల హక్కుల చట్టం, 2016 (PwD Act) నిబంధనలకు లోబడి కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల పింఛను అర్హతల్లో చారిత్రాత్మక మార్పులు చేసింది.

వైకల్య శాతం తగ్గింపు: గతంలో పింఛను వర్తించాలంటే కనీసం 80% వైకల్యం ఉండాలనే కఠిన నిబంధన ఉండగా, దానిని సగానికి సవరించి 40% వైకల్యం ఉన్న దివ్యాంగులను కూడా అర్హులుగా గుర్తించారు.
వయోపరిమితి తొలగింపు & పెన్షన్ పెంపు: వయోపరిమితిని ఎత్తివేసి, పుట్టినప్పటి నుండి 79 ఏళ్ల వయస్సు ఉన్న దివ్యాంగుల నెలవారీ పింఛను సహాయాన్ని రూ. 300 నుండి రూ.375 కి పెంచారు. అలాగే 80 ఏళ్లు దాటిన దివ్యాంగ సీనియర్ సిటిజన్లకు సహాయాన్ని రూ. 500 నుండి రూ.625 కి పెంచారు.

ఈ అర్హతల సడలింపు ద్వారా దేశవ్యాప్తంగా అదనంగా మరో 27.48 లక్షల మంది దివ్యాంగులు కొత్తగా ప్రభుత్వ పింఛను పరిధిలోకి రానున్నారు. రాబోయే 90 రోజుల్లో ఈ కొత్త మార్గదర్శకాలు పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+