న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్‌న్యూస్. పెన్షన్ కమ్యూటేషన్ తిరిగి అమలు చేయాలని ఈపీఎఫ్ఓ సూచనలను కేంద్ర కార్మికశాఖ అమలు చేసింది. దీంతో 6.3 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. పెన్షన్ కమ్యూటేషన్ ద్వారా ఒక పెన్షనర్ తన మొత్తం డబ్బులో కొంత భాగాన్ని ముందుగానే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. ఆ తర్వాత మిగిలిన డబ్బులు 15 ఏళ్ల వరకు పెన్షన్ రూపంలో వచ్చేది. తాజా నిర్ణయంతో కట్ అయిన డబ్బులు ఒకేసారి పెద్ద మొత్తంలో రావడమే కాకుండా 15 ఏళ్ల వరకు పూర్తి పెన్షన్ పెన్షనర్లకు అందనుంది.
సెప్టెంబర్ 25, 2008లోగా కమ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి పూర్తి స్థాయిలో పెన్షన్ అందజేయాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సూచనను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20న నోటిఫై చేసింది. దీంతో ఈపీఎఫ్‌ఓ కింద నడిచే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లో సవరణలు జరిగాయి. 15 ఏళ్ల తర్వాత కూడా పూర్తి స్థాయిలో పెన్షన్లు వస్తాయని పేర్కొంటూ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంతో 6.3 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. సెప్టెంబర్ 25, 2008లోపు కమ్యూటేషన్‌కు అప్లయ్ చేసుకున్న వారికి వారి రిటైర్‌మెంట్ సమయంలో పెన్షన్ ఫండ్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చింది. కమ్యూటేషన్ పద్ధతిన నెలవారీ పెన్షన్‌లో మూడోవంతు కోత ఉండేది. ఇలా 15 ఏళ్ల వరకు ఉండేది. ఆ తర్వాత తగ్గించబడిన డబ్బులు ఒకేసారి మొత్తంగా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కొత్త పద్ధతి ద్వారా 15 ఏళ్ల తర్వాత కూడా పూర్తి స్థాయిలో పెన్షన్ వస్తుంది.
ఆగష్టు 2019లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి నేతృత్వంలో జరిగిన సమావేశంలో మొత్తం 6.3 లక్షల మంది పెన్షనర్లకు కమ్యూటేషన్ పునరుద్ధరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. అయితే ఫిబ్రవరి 20న ఇది కార్యరూపం దాల్చింది. ఎంప్లాయిమెంట్ పెన్షన్ స్కీమ్ 1995 చట్టంలో సవరణలు చేయాల్సిందిగా ఈపీఎఫ్‌ఓ సూచనలు చేసింది. అంతకుముందు తమ నెలవారీ పెన్షన్ల నుంచి మూడోవంతు కోత విధించేవారు. ఇది కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఇంకా అమలవుతోంది.


Click it and Unblock the Notifications