Penny Stock: ఇన్వెస్టర్లు ఎగబడి కొన్న పెన్నీ స్టాక్.. 5 రోజుల్లో 58 శాతం అప్..
Rama Steel Tubes: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారుల చూపు పెన్నీ స్టాక్స్ పై ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందుకే వాటిలో కలదికలు చాలా వేగంగా ఉంటుంటాయి. పెరిగినా లేక పడిపోయినా ఈ షేర్లలో భారీ వ్యత్యాసం ఉంటుంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రామా స్టీల్ ట్యూబ్స్ కంపెనీ గురించే. ఈవారం కంపెనీ షేర్లు భారీ పెరుగుదలను చూశాయి. శుక్రవారం ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేర్లు 19 శాతానికి పైగా లాభంతో రూ.16.60 వద్ద బీఎస్ఈలో తమ ప్రయాణాన్ని ముగించాయి. దీంతో కంపెనీ షేర్లు సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.16.82ను అందుకున్నాయి. గడచిన కొన్ని రోజుల్లో కంపెనీ చేసిన ప్రకటనలతో స్టాక్ ఏకంగా 5 ట్రేడింగ్ సెషన్లలో 58 శాతానికి పైగా లాభపడింది.

ఈ క్రమంలో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి సెప్టెంబర్ 2న రూ.10.50 స్థాయి నుంచి సెప్టెంబర్ 6న రూ.16.60కు చేరుకున్నాయి. గత 4 ఏళ్లలో రామ స్టీల్ ట్యూబ్స్ షేర్లు 3100% కంటే ఎక్కువ రాబడిని పెట్టుబడిదారులకు అందించాయి. సెప్టెంబర్ 4, 2020న కంపెనీ షేర్లు 51 పైసల వద్ద ఉన్నాయి. రామ స్టీల్ ట్యూబ్స్ షేర్లు 6 సెప్టెంబర్ 2024న రూ.16.60కి చేరుకున్నాయి. గత 3 సంవత్సరాల్లో పెన్నీ స్టాక్ షేర్లు విపరీతంగా 415% పెరిగాయి. కంపెనీ షేర్లు సెప్టెంబర్ 3,2021న రూ.3.22 వద్ద ఉన్నాయి.
రామ స్టీల్ ట్యూబ్స్ షేర్లు భారీగా పెరగటానికి ఒక కారణం రక్షణ రంగంలో తన ప్రవేశాన్ని ప్రకటించటమే. తమ పూర్తి యాజమాన్యంలోని యూనిట్ రామ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ 2 సెప్టెంబర్ 2024న కార్పొరేట్ మంత్రిత్వ శాఖ నుంచి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్‌ను అందుకుంది. అలాగే రామ స్టీల్ ట్యూబ్స్ ఒనిక్స్ రెన్యూవబుల్స్‌తో కూడా భాగస్వామ్యం కలిగి ఉంది.
రామ స్టీల్ ట్యూబ్స్ సోలార్ ప్రాజెక్టుల కోసం ఒనిక్స్ రెన్యూవబుల్స్‌కు ఉక్కు నిర్మాణాలు , సింగిల్ యాక్సిస్ ట్రాకర్లను సరఫరా చేస్తుంది. భవిష్యత్తులో డ్యూయల్ యాక్సిస్ ట్రాకర్లను సరఫరా చేయాలని కంపెనీ యోచిస్తోంది. సోలార్ ప్రాజెక్టుల కోసం కంపెనీ ప్రత్యేక ఉక్కు నిర్మాణాలు, ట్రాకర్ ట్యూబ్‌లను అభివృద్ధి చేసింది.


Click it and Unblock the Notifications