Rama Steel Tubes: అంతర్జాతీయ మార్కెట్ల పవనాలను అనుకరిస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నప్పటికీ కొన్ని పెన్నీ స్టాక్స్ తమ పని తాము చేసుకుపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అవి పెట్టుబడిదారులకు ఊహించని స్థాయిలో మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రెండు వారాలుగా ఇన్వెస్టర్లకు భారీగా రాబడులను తెచ్చిపెడుతున్న పెన్నీ స్టాక్ రామ స్టీల్ ట్యూబ్స్ కంపెనీ షేర్ల గురించే. స్మాల్‌క్యాప్ కంపెనీ రామా స్టీల్ ట్యూబ్స్ స్టాక్ నేడు దాదాపు 10 శాతం పెరిగి రూ.15.47కు చేరుకుంది. రామ స్టీల్ ట్యూబ్స్ 52 వారాల గరిష్ఠ స్థాయి షేర్లు రూ.17.51కి అత్యంత సమీపంలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. రామ స్టీల్ ట్యూబ్స్ 2016 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను బహుమతిగా అందించింది.

రామ స్టీల్ ట్యూబ్స్ కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు భారీగా ఆసక్తి కనబరచటంతో స్టాక్ ధర గడచిన 15 రోజుల్లో 53% కంటే ఎక్కువ లాభపడింది. ఒక్కో షేరు ధర ఆగస్ట్ 26, 2024న రామ స్టీల్ ట్యూబ్స్ షేర్లు రూ.10.10 నుంచి నేడు రూ.15.47కి ఈ క్రమంలో పెరిగింది. గడచిన 5 ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ ధర 21 శాతం పెరగటంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,315 కోట్లకు చేరుకుంది.
రామ స్టీల్ ట్యూబ్స్ కంపెనీ మార్చి 2016లో 4:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందించింది. అర్హులైన ఇన్వెస్టర్లకు ప్రతి షేరుకు నాలుగు ఉచిత షేర్లను బహుమతిగా అందించింది. దీని తర్వాత 2023లో మళ్లీ 4:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇన్వెస్టర్లకు ఆఫర్ చేసింది. ఇక చివరిగా 2024లో 2:1 నిష్పత్తిలో ప్రతి 1 షేరుకు 2 బోనస్ షేర్లను అందించింది. ఇటీవలి కాలంలో కంపెనీ పెద్ద ప్రకటన చేసింది. కంపెనీ తన పూర్తి యాజమాన్యంలోని యూనిట్ రామ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను రక్షణ రంగానికి ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ 2 సెప్టెంబర్ 2024న కార్పొరేట్ మంత్రిత్వ శాఖ నుండి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ కూడా అందుకుంది. అలాగే రామ స్టీల్ ట్యూబ్స్ ఒనిక్స్ రెన్యూవబుల్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.
రామ స్టీల్ ట్యూబ్స్ సోలార్ ప్రాజెక్టుల కోసం ఒనిక్స్ రెన్యూవబుల్స్‌కు ఉక్కు నిర్మాణాలు, సింగిల్ యాక్సిస్ ట్రాకర్లను సరఫరా చేస్తుంది. భవిష్యత్తులో డ్యూయల్ యాక్సిస్ ట్రాకర్లను సరఫరా చేయాలని కంపెనీ యోచిస్తోంది. సోలార్ ప్రాజెక్టుల కోసం కంపెనీ ప్రత్యేక ఉక్కు నిర్మాణాలు, ట్రాకర్ ట్యూబ్‌లను అభివృద్ధి చేసింది


Click it and Unblock the Notifications