Free Shares: 9 షేర్లను ఉచితంగా ఇస్తున్న పెన్నీ స్టాక్.. సంతోషంలో ఇన్వెస్టర్లు..
Bonus Shares: దాదాపు రెండో త్రైమాసికం ముగింపు దగ్గర పడుతున్న వేళ ఇటీవల చాలా కంపెనీలు తమ పెట్టుబడిదారుల కోసం ఉచితంగా బోనస్ షేర్లను, డివిడెండ్ చెల్లిస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా మంచి రాబడులను అందించిన Jonjua Overseas Limited స్టాక్ తన ఇన్వెస్టర్లకు శుభవార్త చెప్పింది. గడచిన మూడు నెలల కాలంలో మార్కెట్ ర్యాలీ కారణంగా 53% రాబడిని ఇచ్చిన కంపెనీ.. ఏడాది ప్రాతిపదికన 41% రాబడిని అందించింది. ఈరోజు మర్కెట్లో కంపెనీ షేర్ ధరను పరిశీలిస్తే బీఎస్ఈలో రూ.12.84 వద్ద ఉంది. నేడు స్టాక్ మార్కెట్లో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.

ఇటీవల కంపెనీ బోర్డు 9:50 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందించాలని నిర్ణయించింది. అంటే కంపెనీలో ప్రతి 50 షేర్లను కలిగి ఉన్న అర్హులైన ఇన్వెస్టర్లకు ఉచితంగా 9 షేర్ల చొప్పున అందించేందుకు ఆమోదించింది. ఇందుకు సంబంధించిన రికార్డు తేదీని అక్టోబర్ 10గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.
1993లో స్థాపించబడిన ఈ స్మాల్ క్యాప్ కంపెనీ స్టార్టప్ కన్సల్టెన్సీ, ప్రాజెక్ట్ ఫైనాన్స్ అండ్ ఐపీవో, లీగల్ అండ్ అకౌంట్ అవుట్‌సోర్సింగ్, వెబ్‌సైట్ అండ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, బిజినెస్ ప్లానింగ్, క్రాస్ బోర్డర్ మార్కెటింగ్ సేవలతో సహా సమాచార సాంకేతిక పరిష్కారాలు, వ్యాపార సేవలను అందిస్తుంది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు తన సేవలను ప్రస్తుతం అందిస్తోంది.


Click it and Unblock the Notifications