Multibagger Stock: స్టాక్ మార్కెట్లు ఎలా ఉన్నప్పటికీ మల్టీబ్యాగర్ స్టాక్స్ మాత్రం తమ పని తాము చేసుకుని పోతూనే ఉంటాయి. ప్రధానంగా మార్కెట్ల బూమ్ సమయంలో ఒక్కసారిగా వీటి పేర్లు బయటకు వస్తుంటాయి. అయితే క్వాలిటీ పెన్నీ స్టాక్స్ కోసం వెతికే చాలా మంది దీనిని కొనుగోలు చేశారు. మార్కెట్లో ప్రముఖ పెట్టుబడిదారు ఆశిష్ కచోలియా కూడా కంపెనీలో భారీగా పెట్టుబడులను కలిగి ఉన్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఫైనోటెక్స్ కెమికల్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. వాస్తవానికి ఈక్విటీ మార్కెట్లలో ఇదొక పెన్నీ స్టాక్. తక్కువ పెట్టుబడి ఉన్న చాలా మంది ఈ షేర్లను కొనుగోలు చేసి దీర్ఘకాలంలో కోటీశ్వరులుగా మారి తమ జీవితాలను మార్చుకున్నారు ఈ కంపెనీ షేర్లతో. కంపెనీ షేర్లు ప్రస్తుతం మార్కెట్లో అప్పర్ సర్క్యూట్ తాకి ఒక్కోటి రూ.278.10 వద్ద గరిష్ఠాన్ని తాకాయి. అయితే 2019లో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.26.95 వద్ద ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టాక్ 900 శాతానికి పైగా భారీ రాబడిని ఇన్వెస్టర్లకు అందించి మల్టీబ్యాగర్ స్టాక్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

5 ఏళ్ల కింద ఇన్వెస్ట్ చేస్తే..
దీర్ఘకాలంలో చూస్తే స్టాక్ కేవలం రూ.1.55 వద్ద నుంచి ప్రస్తుత స్థాయిలకు పెరిగింది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు 17840 శాతం రాబడిని అందుకోవటం గమనార్హం. అంటే ఐదేళ్ల కింద ఎవరైనా కంపెనీ షేర్లలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఆ మెుత్తం పెట్టుబడి విలువ రూ.1.80 కోట్లకు చేరుకునే ఉండేది. ప్రస్తుతం స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.458.85 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.262.65 వద్ద ఉంది. అంటే ప్రస్తుతం ఇంట్రాడేలో స్టాక్ తన 52 వారాల కనిష్ఠ కంటే కొంచెం ఎక్కువ రేటు వద్ద ట్రేడవుతోంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,130 కోట్లుగా ఉంది.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ప్రముఖ ఇన్వెస్టర్లలో ఒకరేజైన ఆశిష్ కచోలియా పోర్ట్ ఫోలియోలో కంపెనీ షేర్లకు స్థానం కల్పించబడటం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కచోలియాకు కంపెనీలో 31,35,568 షేర్లు ఉన్నట్లు వెల్లడైంది.
కంపెనీ వ్యాపారం విషయాన్ని పరిశీలిస్తే స్పెషాలిటీ కెమికల్స్ తయారీ రంగంలో కంపెనీకి మంచి గుర్తింపు కూడా ఉంది. కంపెనీ ఉత్పత్తులు వస్త పరిశ్రమ, హోమ్ క్లీనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లోని కంపెనీలు ఉపయోగిస్తుంటాయి. టెక్స్టైల్ రంగంలో ప్రీ ట్రీట్మెంట్, డైయింగ్ అండ్ ప్రింటింగ్ వంటి ప్రాసెసింగ్ ప్రక్రియలో ఈ కెమికల్స్ వినియోగించబడతాయి. ఫినియోటెక్స్ కెమికల్ భారతదేశంలో 102 పంపిణీదారుల బలమైన నెట్‌వర్క్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 69 దేశాల్లోని కస్టమర్లకు తన సేవలను అందిస్తోంది. అలాగే కంపెనీ మూడవ త్రైమాసికంలో రూ.130.91 కోట్ల ఆదాయం నమోదు చేసింది. ఇక పన్నుల తర్వాత రూ.28 కోట్ల లాభాన్ని చూసింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications