Penny Multibagger: లాభాల కుమ్ముడే.. లక్షను రూ.44 లక్షలు చేసిన స్టాక్, మీరూ కొన్నారా?
Syncom Formulations: గడచిన కొన్నాళ్లుగా కొనసాగుతున్న బుల్ మార్కెట్ల జోరులో అనేక పెన్నీ స్టాక్స్ భారీగా పెరుగుదలను చూస్తున్నాయి. ఈ క్రమంలో లక్షలు పెట్టిన వారు కోటీశ్వరులుగా మారిపోతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సింకామ్ ఫార్ములేషన్స్ కంపెనీ షేర్ల గురించే. ఈ పెన్నీ స్టాక్ షేర్లు ఇటీవలి కాలంలో రాకెట్ పెరుగుదలతో ఇన్వెస్టర్లకు ఊహించని రాబడులను అందించింది. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో స్టాక్ ఏకంగా 17 శాతం పెరుగుదలతో రూ.27.23కి చేరింది. ఇది కంపెనీ షేర్లకు సరికొత్త 52 వారాల గరిష్ఠ ధర. గడచిన నాలుగున్నర ఏళ్లలో స్టాక్ 4300% కంటే ఎక్కువ రాబడిని ఇన్వెస్టర్లకు అందించింది. స్మాల్‌క్యాప్ కంపెనీ సింకామ్ ఫార్ములేషన్స్ షేర్లు ఈ కాలంలో రూ.లక్ష పెట్టుబడిని రూ.44 లక్షలుగా మార్చేసింది.

ఎవరైనా ఇన్వెస్టర్ మార్చి 27, 2020న సింకామ్ ఫార్ములేషన్స్ షేర్లలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే నేడు మార్కెట్ విలువ ప్రకారం వారి పెట్టబడి రూ.44.63 లక్షలకు చేరుకుని ఉండేది. ఇదే క్రమంలో కంపెనీ షేర్ల 52 వారాల కనిష్ఠ ధర రూ.7.66గా ఉన్న సంగతి తెలిసిందే. గడచిన ఏడాది కాలంలో పెన్నీ స్టాక్ తన ఇన్వెస్టర్లకు 210 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 11,2023న కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.8.73 రేటు వద్ద ఉండేవి.
ఇక గడచిన 6 నెలల్లో కంపెనీ షేర్లు 105 శాతానికి పైగా రాబడిని అందించాయి. ఈ క్రమంలో అప్పట్లో స్మాల్‌క్యాప్ స్టాక్ షేర్ల ధర మార్చి 11, 2024న రూ.13.37 వద్ద ఉన్నాయి. అలాగే గత నెలలో సింకామ్ ఫార్ములేషన్స్ షేర్లు 77% కంటే ఎక్కువ పెరుగుదలతో పెట్టుబడిదారులను లాభాల వర్షంతో ముంచేసింది. ఈ పెన్నీ స్టాక్ 2013 ఆగస్టులో తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను బహుమతిగా ఇచ్చింది. కంపెనీ 5:2 నిష్పత్తిలో బోనస్ షేర్లను పంపిణీ చేసింది. అంటే కంపెనీ ప్రతి 2 షేర్లకు 5 బోనస్ షేర్లను ఇన్వెస్టర్లకు కంపెనీ ఉచితంగా అందించింది.


Click it and Unblock the Notifications