Praveg Stock: ఇప్పుడు ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా లక్షద్వీప్ పేరే. ప్రధానీ మోదీ పర్యటన తర్వాత జరిగిన పరిణామాలతో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అనేక మంది వీటిని నిశితంగా పరిశీలిస్తున్నారు.
మరోపక్క మాల్ దీవ్స్ ప్రభుత్వ ప్రతినిధులు చేస్తున్న దిగజారుడు రాజకీయాలను దేశంలోని ప్రజలు తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో లక్షద్వీప్ కేవలం దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. అనేక మంది ప్రజలు ఈ పర్యాటక ప్రాంతం గురించి గూగుల్ ద్వారా వివరాలను పొందేందుకు సెర్చ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో లక్షద్వీప్‌కు సంబంధించిన కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్‌లో వేగంగా పెరుగుతున్నాయి. అలా ట్రెండ్ అవుతున్న షేర్లలో ప్రవేగ్ లిమిటెడ్ కూడా ఒకటి. కంపెనీ ప్రస్తుతం టూరిజం హబ్‌గా మారుతున్న కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో 50 టెంట్ హౌస్‌లను నిర్మించే కాంట్రాక్టును గెలుచుకుంది. దీంతో కంపెనీ షేర్లు సోమవారం మార్కెట్లో ఏకంగా 20 శాతం పెరిగాయి. గడచిన ఐదు రోజులుగా కంపెనీ షేర్ ధర 37 శాతానికి పైగా పెరగటం గమనార్హం. అయితే నేడు బీఎస్ఈలో స్టాక్ 4.60 శాతం క్షీణించి రూ.1,163 రేటు వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
స్టాక్ 52 వారాల గరిష్ఠ ధరను పరిశీలిస్తే రూ.1300గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.315 వద్ద ఉంది. గడచిన వారం రోజుల్లో ప్రవేగ్ లిమిటెడ్ కంపెనీ స్టాక్ వరుసగా రెండు సార్లు 20 శాతం అప్పర్ సర్క్యూట్ తాకటం అనేక మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. స్టాక్ ఒక నెలలో 50%, మూడు నెలల్లో 80%, ఆరు నెలల్లో 100% కంటే ఎక్కువ రాబడిని అందించింది. అలాగే ఐదేళ్ల కాలంలో పెట్టుబడిదారులు 51,000 శాతం రాబడిని అందుకున్నారు. వాస్తవానికి కంపెనీ షేర్ ధర 2019లో కేవలం రూ.2.40 వద్ద ఉంది. అంటే ఆ సమయంలో ఎవరైనా ఇన్వెస్టర్ లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఇప్పటి వరకు కొనసాగించి ఉన్నట్లయితే దాని విలువ ఏకంగా రూ.5 కోట్లకు చేరుకుని ఉండేది.

ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల మెుత్తం వాటా 54.53 శాతంగా ఉంది. ఇప్పటికే కంపెనీకి దేశంలోని వివిధ ప్రాంతాల్లో టెంట్ సిటీలను నిర్మించేందుకు కంపెనీకి ఆర్డర్లు వచ్చాయి. 2013లో రన్ ఉత్సవ్ కోసం కచ్‌లో టెంట్ సిటీని అభివృద్ధి చేయడానికి కంపెనీ తన మొదటి ప్రధాన ఆర్డర్‌ను అందుకుంది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దీని తరువాత 2018 సంవత్సరంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో టెంట్ సిటీని అభివృద్ధి చేయడానికి టెండర్ వచ్చింది. అదే సమయంలో ప్రవేగ్ 2023లో వారణాసి, డామన్ అండ్ డయ్యూలో కాంట్రాక్టులను కూడా గెలుచుకున్నాడు.ఈ సంస్థ అయోధ్యలోని రామజన్మభూమి సమీపంలో టెంట్ సిటీని నిర్మిస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications