Penny Multibagger: భారీగా ఆర్డర్లు కొట్టేస్తున్న మల్టీబ్యాగర్.. లక్షను రూ.18 లక్షలు చేసి..
Multibagger stock: చాలా మంది ఇన్వెస్టర్లు తక్కువ ధరలో ఉండే పెన్నీ, స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. అయితే వీటిలో రిటర్న్స్ ఎంత భారీగా ఉంటాయో రిస్క్ కూడా అంతే అధికం. ఒకవేళ సరిగా అంచనా వేయటంలో ఇన్వెస్టర్ విఫలమైతే కష్టార్జితం గల్లంతే. కానీ సరైన మల్టీబ్యాగర్లు కాసుల పంట కురిపిస్తాయి.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది MIC Electronics కంపెనీ షేర్ల గురించే. ఈ మైక్రో క్యాప్ కంపెనీ రెండేళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు దాదాపు 1,765 శాతం రాబడిని అందించింది. దీంతో నమ్మి దీర్ఘకాలం పెట్టుబడి కొనసాగించిన ఇన్వెస్టర్ల తలరాత ఒక్కసారిగా మారిపోయింది. ఇదే క్రమంలో ఈ చిన్న కంపెనీ భారీగా ఆర్డర్లను పొందడంతో షేర్ మంచి పనితీరును కనబరుస్తోంది. సమాచారం ప్రకారం కంపెనీ రూ.4 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆర్డర్లను పొందింది.

రెండేళ్ల క్రితం ఒక్కో కంపెనీ షేర్ ధర రూ.0.67 గా ఉండేది. ఈరోజు మార్కెట్లో షేర్ ధర రూ.12.65గా ఉంది. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ గతంలో ధర తక్కువగా ఉన్నప్పుడు ఎవరైనా లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఇప్పటి వరకు దీర్ఘకాలం పాటు కొనసాగించి ఉంటే మార్కెట్లో షేర్ల విలువ రూ.18 లక్షల కంటే ఎక్కువగా ఉండేది. కంటెనీ ఇటీవల తూర్పు మధ్య రైల్వేల నుంచి బీహార్ డివిజన్ కోసం ఆర్డర్లు పొందింది.
ప్రస్తుతం మార్కెట్లో కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.275 కోట్లుగా ఉంది. ఈ కంపెనీలో దాదాపు 74.63 శాతం వాటాలను ప్రమోటర్లు కలిగి ఉన్నారు. ప్రస్తుతం కంపెనీ పనితీరు ఉత్తమంగా కొనసాగుతున్న తరుణంలో చాలా మంది ఇన్వెస్టర్లు పెట్టుబడి అవకాశాలను అన్వేషించేందుకు కన్నేసి ఉంచారు. ఈ కంపెనీ 1988లో తన వ్యాపారాన్ని ప్రారంభించింది.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications