For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా దెబ్బ, ఆగస్ట్ నెలలో భారీగా తగ్గిన విద్యుత్ డిమాండ్

|

ఆగస్ట్ తొలి రెండు వారాల్లో విద్యుత్ డిమాండ్ 5.6 శాతం మేర క్షీణించింది. జూలై నెలలో 2.61 శాతం మేర డిమాండ్ పడిపోయింది. దీనికి ఆగస్ట్ నెలలో అదనం. దేశవ్యాప్తంగా ఒక రోజులో అత్యధిక విద్యుత్ డిమాండ్ పగటి పూట ఉంటోంది. ఆగస్ట్ తొలి రెండు వారాల్లో (15 రోజులు) విద్యుత్ డిమాండ్ 167.49GWగా ఉంది. 2019 ఆగస్ట్‌లో ఇది 177.52GWగా రిజిస్టర్ అయింది. దీంతో పోలిస్తే 5 శాతం పడిపోయింది. ఈ ఏడాది జూలైలో అత్యధికంగా జూలైలో 170.54 GW విద్యుత్ డిమాండ్ నమోదయింది. గత ఏడాది ఇదే జూలై కాలంలో 175.12 GWగా ఉండగా, ఈసారి 2.61 శాతం క్షీణించింది.

సిటీ బ్యాంక్ రూ.6,700కోట్ల శతాబ్దపు పొరపాటు, తిరిగిచ్చేందుకు వారు నోసిటీ బ్యాంక్ రూ.6,700కోట్ల శతాబ్దపు పొరపాటు, తిరిగిచ్చేందుకు వారు నో

ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత ఈ ఏడాది మే నెల నుండి విద్యుత్ డిమాండ్ స్థిరీకరించబడుతుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. 2025 మార్చి 25వ తేదీ నుండి కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ భారీగా పడిపోయింది. దీంతో అందుకే ఈ ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ నుండి) విద్యుత్ డిమాండ్ క్షీణించింది. ఏప్రిల్ నెలలో విద్యుత్ డిమాండ్ ఏకంగా 25 శాతం పడిపోయింది.

Peak power demand drops further to 5.6 percent in first two weeks of August

వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాల కోసం లాక్ డౌన్ సడలించిన అనంతరం మే నుండి విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. జూన్ నెలలో విద్యుత్ డిమాండ్ 9.6 శాతం క్షీణించి, 164.98 GWగా ఉంది. 2019 జూన్‌లో ఇది 182.45 GWగా నమోదయింది. మే నెలలో విద్యుత్ డిమాండ్ గత ఏడాది 182.53 GWగా ఉండగా, ఈసారి 8.9 శాతం తగ్గి 166.22 GWగా నమోదయింది. ఏప్రిల్ నెలలో 176.81 GW నుండి 25 శాతం పడిపోయి 132.73 GWగా రికార్డ్ అయింది.

English summary

కరోనా దెబ్బ, ఆగస్ట్ నెలలో భారీగా తగ్గిన విద్యుత్ డిమాండ్ | Peak power demand drops further to 5.6 percent in first two weeks of August

Peak power demand sank further to 5.6 per cent in the first two weeks of August, against the 2.61 per cent slump recorded in July, according to power ministry data.
Story first published: Tuesday, August 18, 2020, 7:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X