PC Jeweller Shares: ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది దేశీయంగా ఆభరణాల వ్యాపారంలో ఉన్న పీసీ జ్యూవెలర్స్ కంపెనీ షేర్ల గురించే. కంపెనీ షేర్లను కొనేందుకు నేడు మార్కెట్లో ఇన్వెస్టర్లు ఎగబటంతో స్టాక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నేడు పీసీ జ్యూవెలర్స్ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ తాకాయి. దీనికి అసలు కారణం కంపెనీ బకాయిల చెల్లింపుల కోసం సమర్పించిన వన్-టైమ్ సెటిల్మెంట్ ప్రతిపాదనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆమోదం తెలపటమే. ఇదే విషయాన్ని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. గతంలో ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం రుణ చెల్లింపులకు ఇలాంటి ప్రతిపాదనను ఆమోదించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జ్యూవెలర్ బ్యాంకుల కన్సార్టియంకు తన రుణ బకాయిలను చెల్లించటానికి వన్ టైమ్ సెటిల్‌మెంట్ మార్గాన్ని ఎంచుకుంది.

కంపెనీ రుణాల చెల్లింపుకు మార్గం సుగమం కావటంతో నేడు బీఎస్ఈలో కంపెనీ షేర్లు లాభంతో రూ.56 రేటు వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆ తర్వాత మునుపటి ముగింపు ధర నుండి 10 శాతం పెరిగి గరిష్టంగా రూ.56.19కి చేరి అప్పర్ సర్క్యూట్ తాకాయి. ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను కొనేందుకు భారీగా ముందుకు రావటంతో ఈ పరిస్థితి నెలకొంది. స్టాక్ రేటు పెరుగుదల తర్వాత కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,600 కోట్లకు చేరుకుంది.
ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆమోదించిన వన్-టైమ్ సెటిల్‌మెంట్ కింద నగదు చెల్లింపులతో పాటు ఈక్విటీ రూపంలో రుణ చెల్లింపు ఉంటుందని వెల్లడైంది. దీనితో పాటు బ్యాంకుల వద్ద ఉన్న సెక్యూరిటీలు, తనఖా ఆస్తుల విడుదలకు సంబంధించిన నిబంధనలు కూడా చేర్చబడ్డాయి. గడచిన ఏడాది కాలంలో పీసీ జ్యూవెలర్స్ స్టాక్ తన ఇన్వెస్టర్లకు 72 శాతం రాబడిని అందించింది. 2024 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.48.49 కోట్లుగా ఉంది.
కంపెనీ మెుత్తం రుణాల వివరాలను పరిశీలిస్తే.. 2021-22 వార్షిక నివేదిక ప్రకారం ఎస్బీఐకి రూ.1,060 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.530 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.478 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.226 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే కంపెనీ పైన పేర్కొన్న బ్యాంకులతో సహా దేశంలో మెుత్తం 14 బ్యాంకుల నుంచి రుణాలను పొందింది. మార్చి 2024 చివరి నాటికి కంపెనీలో ప్రమోటర్లు 54.53 శాతం వాటాను కలిగి ఉండగా.. మిగిలిన 45.47 శాతం వాటాను పబ్లిక్ ఇన్వెస్టర్లు హోల్డ్ చేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications