PC Jeweller: ఒక్క రోజే 6 శాతం పెరిగిన స్టాక్.. ఇంకా పెరుగుతుందా..!
స్టాక్ మార్కెట్ లో కంపెనీలకు సంబంధించి అప్డేట్ వచ్చినప్పుడు అవి పెరగడమా, తగ్గడమా లేదా ప్లాట్ గా ఉంటాయి. చాలా వరకు కంపెనీలు ఎక్స్ఛేంజీ ఫైలింగ్ లో ఇచ్చే అప్డేట్ ను బట్టి స్టాక్స్ స్పందిస్తుంటాయి. తాజాగా ఆభరణాల విక్రయ కంపెనీ పీసీ జ్యువెలర్ స్టాక్ భారీగా పెరిగింది. బుధవారం ఉదయం ట్రేడింగ్ సెషన్ లో కంపెనీ షేర్లు 6 శాతం పెరిగాయి. కంపెనీ అప్పులకు సంబంధించి రెండు కన్సార్టియం బ్యాంకులతో కుదుర్చుకున్న సెటిల్‌మెంట్ ఒప్పందం కూదుర్చుకుంది. బకాయిలన్నింటినీ తిరిగి చెల్లించినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీ ఫైలింగ్ లో తెలిపింది. దీంతో ఈ రోజు స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
తమ కంపెనీని త్వరలోనే రుణ రహిత సంస్థ మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. 14 కన్సార్టియం బ్యాంకులలో రెండింటికి సంబంధించి 30 సెప్టెంబర్ 2024 నాటి సెటిల్‌మెంట్ ఒప్పందం కింద ఉన్న అన్ని బకాయిలను విజయవంతంగా చెల్లించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ త్రైమాసికంలోనే రుణరహిత హోదాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. కంపెనీ తిరిగి గాడిలో పెట్టే క్రమంలో రుణాల చెల్లింపు ముఖ్యమైన పరిణామమని తెలిపింది. విస్తృత డీలివరేజింగ్ ప్రణాళికలో భాగంగా మరిన్ని రుణాల చెల్లింపులు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.

పీసీ జ్యువెలర్ లిమిటెడ్ FY27 మొదటి త్రైమాసికంలో ఏకీకృత ఆదాయంలో సంవత్సరానికి 21% వృద్ధిని నివేదించింది. ఈ త్రైమాసికం అంటే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రుణరహిత కంపెనీగా మారాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఆభరణాల రిటైలర్ గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే తమ ఏకీకృత ఆదాయం సుమారు 21% పెరిగిందని వివరించింది. కంపెనీ తన బకాయి ఉన్న బ్యాంకు రుణాన్ని 90 శాతం కంటే ఎక్కువగా తగ్గించుకుందని ప్రకటించింది. ప్రస్తుత త్రైమాసికంలో రుణరహిత స్థితిని సాధించే దిశగా పయనిస్తోందని వెల్లడించింది.
ఈ ప్రకటనతోనే స్టాక్ లో పాజిటివిటి కనిపించింది. జూన్ త్రైమాసికంలో పీసీ జ్యువెలర్ జాయింట్ సెటిల్‌మెంట్ అగ్రిమెంట్ కింద బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయి రుణాన్ని అదనంగా 24 శాతం తగ్గించుకుంది. బీఎస్‌ఈలో పీసీ జ్యువెలర్ షేరు ధర ఈరోజు ఇంట్రాడే కనిష్టంగా రూ.9.47 వద్ద ప్రారంభమై.. ఇంట్రాడే గరిష్టంగా రూ.10.01కి చేరింది. ఈ స్టాక్ గ్యాప్-అప్‌తో ప్రారంభమై సుమారు 3.5% అధికంగా ట్రేడ్ అవుతూందని ఏంజెల్ వన్‌కు చెందిన ఈక్విటీ టెక్నికల్, డెరివేటివ్ అనలిస్ట్ రాజేష్ భోసలే తెలిపారు. గత కొన్ని సెషన్లుగా ఈ స్టాక్ రూ.9 నుంచి రూ.11 మధ్య ఊగిసలాడుతూ అత్యంత అస్థిరంగా ఉందని వివరించారు.
రూ.11 స్థాయికి పైన స్థిరంగా కొనసాగితే మరింత పెరుగుదల మొదలై, ఈ స్టాక్ రూ.15 దిశగా కదిలే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications