Vijay Shekhar Sharma: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆంక్షలు స్టార్టప్ కంపెనీ యజమానుల్లో ఆందోళనకు, ఆగ్రహానికి కారణమైంది. రిజర్వు బ్యాంక్ చిన్న తప్పులకు తీవ్ర స్థాయిలో స్పందించాల్సిన అవసరం లేదంటూ వారు అభిప్రాయపడుతున్నారు.
దీనిపై తాజాగా పేటీఎం వ్యవస్థాపకుడు, CEO విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. కంపెనీ ఇతర బ్యాంకులతో మాత్రమే పనిచేస్తున్నందున పేమెంట్స్ బ్యాంక్ కాదని అన్నారు. దేశంలోని పెద్ద బ్యాంకుల నుంచి తమకు మద్దతు ఉందని అన్నారు. రిజర్వు బ్యాంక్ ఆంక్షలు కంపెనీ మార్కెటింగ్ అండ్ ఫైనాన్షియల్ అంశాల కారణంగా సేవల వ్యాపారం ప్రభావితం కాదని శర్మ వెళ్లడించారు. ఈ చర్యపై ఆర్‌బీఐ తమకు ఎలాంటి వివరాలను పంపలేదన్నారు.

అయితే రిజర్వు బ్యాంక్ చర్యల కారణంగా నేడు స్టాక్ మార్కెట్లు తెరచుకోగానే పేటీఎం షేర్లు కుప్పకూలాయి. షేర్ ధర ఒక్కసారిగా 20 శాతం క్షీణించి ఎన్ఎస్ఈలో స్టాక్ ఆరు వారాల కనిష్ఠమైన రూ.609 స్థాయికి చేరుకుంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ నేడు 1.2 బిలియన్ డాలర్లు ఆవిరైంది. 2021లో లిస్టింగ్ అయినప్పటి నుంచి పేటీఎం షేర్లు నేడు అత్యంత చెత్త ట్రేడింగ్ రోజును నమోదు చేశాయి.
కంపెనీలో మెుత్తం విజయ శేఖర్ శర్మ 19.4 శాతం వాటాను కలిగి ఉన్నారు. అలాగే పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో 51 శాతం వాటాను హోల్డ్ చేస్తున్నారు. నేడు మార్కెట్లో స్టాక్ కుప్పకూలటం వల్ల శర్మ సంపద విలువ 233 మిలియన్ డాలర్ల మేర క్షీణతకు గురైంది. దాదాపు రెండు దశాబ్ధాల కిందట శర్మ పేటీఎం కంపెనీని ప్రారంభించారు. ఉబెర్ తర్వాత దేశంలో వేగంగా పేరుగాంచిన స్టార్టప్ కంపెనీగా పేటీఎం పేమెంట్స్ గుర్తింపును కలిగి ఉంది. అయితే 2016లో మోదీ ప్రభుత్వం నోట్ల రద్దుకు దిగటంతో పేటీఎం చాలా వేగంగా మార్కెట్లో ప్రాచుర్యాన్ని పొంది డిజిటల్ చెల్లింపుల విభాగంలో పుంజుకుంది. అయితే మెుత్తానికి రిజర్వు బ్యాంక చర్యలు తమ వ్యాపారానికి ఎలాంటి నష్టాన్ని కలిగించబోవను శర్మ తేల్చి చెప్పారు.


Click it and Unblock the Notifications