స్టాక్ బ్రోకింగ్ సేవల్లోకి పేటీఎం... మరికొన్ని వారాల్లో సేవలు!

ఇండియన్ ఫిన్ టెక్ కంపెనీలు ఒకటిని మించి మరోటి కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తున్నాయి. డిజిటల్ పేమెంట్స్ విభాగంలో దేశంలో మార్కెట్ లీడర్ గా ఉన్న పేటీఎం... త్వరలోనే స్టాక్ బ్రోకింగ్ సేవల్లోకి ప్రవేశించబోతోంది. ఈ విషయాన్నీ స్వయానా పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ వెల్లడించటం విశేషం. ఇప్పటికే డిజిటల్ పేమెంట్లతో పాటు ఈ కామర్స్ రంగంలోనూ పేటీఎం విస్తరించింది. స్మాల్ పేమెంట్స్ బ్యాంకు అవతారం ఎత్తిన తర్వాత మరిన్ని సేవల్లోకి ప్రవేశించింది.

వీటితో పాటు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే సేవలు సహా ఇతర అనేక ఆర్థిక సేవలు అందించేందుకు సమాయత్తమవుతోంది. దీంతో ఇందుగలడందు సందేహంబు వలదు అన్నట్లు... కుదిరిన అన్ని రంగాల్లో కి ప్రవేశించి పేటీఎం పేరు చెబితే అందరూ గుర్తు పట్టేలా ... అన్ని రకాల సేవలు ఒకే గొడుగు కింద అందించేలా వ్యూహాలు రచిస్తున్నారు. గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ సందర్భంగా సికోయ కాపిటల్ ఇండియా ఎండి రాజన్ ఆనందన్ తో జరిగిన ఫైర్ సైడ్ చాట్ లో భాగంగా విజయ్ శేఖర్ శర్మ స్టాక్ బ్రోకింగ్ రంగ ప్రవేశం గురించి వెల్లడించారు.

జనవరి లోనే లైసెన్స్...

జనవరి లోనే లైసెన్స్...

పేటీఎం స్టాక్ బ్రోకింగ్ సేవలు అందించే విషయం మనకు ఇప్పుడు మాత్రమే తెలుస్తున్నా... తెర వెనుక చాలా రోజులుగా ఇందుకోసం కసరత్తు మొదలైందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరిలోనే పేటీఎం కు స్టాక్ బ్రోకింగ్ సేవలు అందించేందుకు గాను సెబీ నుంచి అనుమతి కూడా లభించింది. దీంతో కంపెనీకి సరికొత్త సేవలు అందించేందుకు మార్గం సుగమం అయింది. కాగా, పేటీఎం వెల్త్ అనే ఫీచర్ ద్వారా పేటీఎం స్టాక్ బ్రోకింగ్ సేవలు అందించనుంది. వీటితో పాటు మరిన్ని సేవల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు విజయ్ శేఖర్ శర్మ తన ఆలోచనలను బహిర్గతం చేశారు. అలాగే ఫిన్ టెక్ రంగంలో ఉన్న అవకాశాలు, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న అంశాలపై కూడా శర్మ తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఫారెక్స్ సేవల్లో అవకాశం...

ఫారెక్స్ సేవల్లో అవకాశం...

ప్రస్తుతం ఇండియా లో ఫారెక్స్ సేవల్లో సరికొత్త అవకాశాలు ఉన్నాయని విజయ్ శేఖర్ శర్మ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ కేవలం కొన్ని సంస్థలు మాత్రమే పని చేస్తున్నాయని, ఆ రంగాన్ని విపరీతంగా నియంత్రిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో అక్కడ సహజంగానే అసమర్థ విధానాలు అవలంభిస్తున్నారని చెప్పారు. ఇండియా లోకి ప్రతి ఏడాది వచ్చే సుమారు 16 బిలియన్ డాలర్ల ఫారెక్స్ పై 4% ఫీజులు విధిస్తున్నారని, అది చాలా అధికం అని అయన అభిప్రాయపడ్డారు. అందుకే ఆ బిజినెస్ కూడా ఆకర్షణీయంగా కనిపిస్తోందని చెప్పారు. 100 బిలియన్ డాలర్ల యూరో లపై వచ్చే 0.1% ఫీజు కంటే... ఇదే ఆకర్షణీయం అని తెలిపారు. కాబట్టి, భవిష్యత్ లో ఫారెక్స్ సేవల్లోకి పేటీఎం ప్రవేశిస్తుందని అయన చెప్పకనే చెప్పారు. ఇండియా లో పేమెంట్స్ బ్యాంకు అకౌంట్ల నుంచి నెట్ బ్యాంకింగ్ కు, అక్కడి నుంచి వాలెట్ కు, తర్వాత టోకెన్ వరకు పరిణామం చెందినా... ఫారెక్స్ లో మాత్రం ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదన్నారు.

టూ వీలర్... సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్...

టూ వీలర్... సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్...

ఇండియా లో ఇంకా మెరుగైన వ్యాపార అవకాశాలు ఉన్న రంగాల్లో ద్విచక్ర వాహన రుణాలు, స్వయం సహాయ సంఘాలు ఉన్నాయని పేటీఎం అధినేత పేర్కొన్నారు. అలాగే ఇప్పటి వరకు సంస్థాగతంగా రుణాలు పొందలేని వారికి కూడా ఒక ప్లాట్ఫారం అందించాల్సిన అవసరం ఉందని అయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో భవిష్యత్ లో దేశం గనుక ఏటా 10-12% వృద్ధి రేటును సాధిస్తే... ఇండియా లోనే సుమారు 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ 75 లక్షల కోట్లు) రుణాలు మంజూరు చేయాల్సి ఉంటుందని చెప్పారు. అది కూడా వచ్చే 4-5 ఏళ్లలోనే జరగాల్సి ఉంటుంది కాబట్టి, అంత భారీ రుణాలు మంజూరు చేయగలిగే వ్యవస్థ మన వద్ద ప్రస్తుతం లేదన్నారు. కాబట్టి, అందులో 10-20 బిలియన్ డాలర్ల మార్కెట్ వాటా పొందినా అది చాలా పెద్ద మొత్తమే అవుతుందని విజయ్ శేఖర్ శర్మ వ్యాఖ్యానించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+