Paytm News: ఆర్బీఐ వేటు, భారీ నష్టాలతో కుదేలైన పేటీఎం.. విధిలేని పరిస్థితుల్లో ఇక తప్పట్లే..
Layoffs News: కరోనా విజృంభణ వేళ UPI సహా నగదు రహిత లావాదేవీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో పేటీఎం పాత్ర ఎంతో ఉంది. అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై నియంత్రణ సంస్థ చర్యలతో కంపెనీ ప్రతిష్ఠ మసకబారింది. తిరిగి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు. అందుకే విధిలేని పరిస్థితుల్లో తీవ్ర చర్యలు తీసుకునేందుకు వెనకాడటం లేదు.
ఖర్చులను తగ్గించుకునేందుకు పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చింంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం 15-20 శాతం ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. ఇటీవల దాదాపు 500 కోట్ల నష్టాలను పోస్ట్ చేయడంతో కంపెనీపై మరింత ఒత్తిడి పెరిగినట్లు వెల్లడించింది. పరిస్థితిని చక్కదిద్దడానికి దాదాపు 5 నుంచి 6 వేలకుపైగా సిబ్బందికి ఉద్వాసన పలకాలని యోచిస్తున్నట్లు పేర్కొంది.

FY23లో కంపెనీ సగటున దాదాపు 33 వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది. వారిలో సుమారు 30 వేల మంది యాక్టివ్ వర్కర్స్ కాగా ఒక్కో ఉద్యోగిపై సగటున 7.87 లక్షలు ఖర్చు చేసింది. FY24 నాటికి ఉద్యోగుల ఖర్చులు ఏడాదికి 34 శాతం పెరిగి 3 వేల 124 కోట్లకు చేరాయి. అంటే సగటు ఉద్యోగిపై వెచ్చించే మొత్తం 10.6 లక్షలకు పెరిగింది.
సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి డిసెంబర్‌లో వెయ్యి మంది ఉద్యోగులను ఇప్పటికే పేటీఎం తొలగించింది. దీంతో తొలగింపుల ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టినట్లు నివేదిక తెలిపింది. ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్‌లోనూ టెక్నాలజీ, మర్చంట్ సేల్స్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పెట్టుబడుల కారణంగా ఉద్యోగుల ఖర్చులు విపరీతంగా పెరిగాయని కంపెనీనే స్వయంగా పేర్కోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications