Paytm News: పేటీఎంపై మార్కెట్లోకి కొత్త నివేదిక.. ఆర్బీఐ దెబ్బకు ఈసారి దుకాణం సర్దుకోవడమేనా..?

Paytm Licence: పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించిన తర్వాత తీవ్ర ఒడిదుడుకులతో సతమతం అవుతోంది. అప్పటి నుంచి చోటుచేసుకుంటున్న పరిణామాలు కంపెనీకి ఇబ్బందిగా మారాయి. తాజాగా మార్కెట్లో నెలకొన్న భయాలు దీనికి మరింత ఆజ్యం పోస్తున్నాయి.

నియంత్రణ ఆందోళనల నడుమ పేటీఎం మాతృసంస్త వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు మరింత పడిపోయాయి. దీనికితోడు తన పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేయవచ్చనే మీడియా నివేదికలు కూడా బయటకు వచ్చాయి. దీంతో ఇవాళ ఉదయం దాదాపు 3 శాతం వరకు స్టాక్ ధరలు క్షీణించాయి. కాగా మధ్యాహ్నం సమయానికి కొంతమేర కోలుకున్నాయి.

Paytm tanked 3percent in morning trade today

అంతకుముందు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద నిబంధనలను ఉల్లంఘించినందుకు PPBLపై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU-IND) 5.49 కోట్ల మేర జరిమానా విధించింది. కాగా ఇప్పుడు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాల పర్యవేక్షణకు RBI ఒక నిర్వాహకుడిని నియమించవచ్చని రిపోర్ట్ పేర్కొంది.

'ఇది చట్టవిరుద్ధ కార్యకలాపాల నుంచి వచ్చిన డబ్బు. అంటే నేరాల ద్వారా వచ్చిన డబ్బును పలు సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో నిర్వహించే బ్యాంక్ ఖాతాల ద్వారా మళ్లించాయి' అని సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఈ వివాదం నేపథ్యంలో పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ.. పార్ట్ టైమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మరియు పేమెంట్స్ బ్యాంక్ బోర్డు మెంబర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+