Paytm Shares: ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీ పేటీఎం ఎదుర్కొన్న కష్టాలు మరో ఇతర కంపెనీ చూడలేదని చెప్పుకోవటం అతిశయోక్తి కాదు. వాస్తవానికి కంపెనీ లాభాల బాటలోకి వెళుతున్న వేళ ఈ ఏడాది రిజర్వు బ్యాంక్ విధించిన కఠిన ఆంక్షలు కంపెనీ వ్యాపారాన్ని పెద్ద కుదుపుకు గురిచేశాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయటంతో అనేక మంది యూజర్లు ఇతర ఆటగాళ్లవైపుకు మళ్లారు.
అయితే ప్రస్తుతం కంపెనీకి మళ్లీ మంచి రోజులు తిరిగి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు భారీ లాభాలను చూశాయి. ఈ క్రమంలో మార్కెట్ల ముగింపు సమయంలో పేటీఎం షేర్ ధర ఎన్ఎస్ఈలో 15.52 శాతం పెరిగి రూ.753 వద్ద ఒక్కోటి ప్రయాణాన్ని ముగించాయి. దీనికి ముందు సోమవారం సైతం పేటీఎం షేర్లు లాభాల్లో పయనించాయి. గడచిన ఐదు నెలల కాలంలో పేటీఎం షేర్లు ఇన్వెస్టర్ల డబ్బులు డబుల్ చేశాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారులు దాదాపు 125 శాతం మేర తమపెట్టుబడిపై రాబడిని అందుకున్నారు. ఈ క్రమంలో కంపెనీ షేర్ల 52 వారాల కనిష్ఠ ధర రూ.310 వద్ద ఉండగా, 52 వారాల గరిష్ఠ ధర రూ.998గా ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.47.94 కోట్లుగా ఉంది.

ఇటీవల పేటీఎం షేర్లు పెరగటానికి కారణం?
పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ మధ్యప్రదేశ్‌లోని 42 కృషి మండిలో 800 పేటీఎం కార్డ్ మెషీన్‌లను అందుబాటులోకి తెచ్చింది. అలాగే కంపెనీ రానున్న రెండేళ్లలో వివిధ వ్యవసాయ మార్కెట్‌లలో అదనంగా 1300 యూనిట్లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యప్రదేశ్‌లోని కృషి మండి యాప్‌ను పేటీఎం కార్డ్ మెషీన్‌లతో అనుసంధానించడం ఇదే మొదటిసారి. ఇది మండీల్లో వ్యాపారులు, రైతులు అమ్మకాల ప్రాసెసింగ్‌లో సమయాన్ని ఆదా చేయనుంది. అసంఘటిత రంగంలో మొబైల్ చెల్లింపుల వ్యాప్తిని పెంపొందించాలనే పేటీఎం లక్ష్యంలో భాగంగా ప్రస్తుత ముందడుగు పడిందని తెలుస్తోంది.
బ్రోకరేజ్ అంనాలు..
కంపెనీ నిర్వహించిన యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తన ఫిన్‌టెక్ చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్ కోసం మళ్లీ దరఖాస్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆగస్టులో పేరెంట్ కంపెనీ పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌లోకి దిగువ పెట్టుబడికి ప్రభుత్వ అనుమతిని పొందిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ నిషేధం కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో ఈ స్టాక్ ఒత్తిడికి గురైంది. బ్రోకరేజ్ వెంచురా సెక్యూరిటీస్ గత నెలలో పేటీఎం షేర్లకు దీర్ఘకాలిక టార్గెట్ ధరను రూ.1170గా ప్రకటించిన సంగతి తెలిసిందే. బులిష్ కేసులో ఇది రూ.1444గా ఉండొచ్చని పేర్కొంది.
వాస్తవానికి మే 8న కంపెనీ షేర్లు మార్కెట్లో ఒక్కోటి రూ.317.15 వద్ద ఉండగా ప్రస్తుతం రెండింతలైంది. ఈ క్రమంలో దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లు మంచి రాబడులను అందుకున్నారు. అలాగే గడచిన మూడు నెలల కాలంలో 75 శాతం రాబడిని అందించిన కంపెనీ షేర్లు 5 నెలల్లో 125 శాతం మెగా రాబడిని అందించాయి. అయితే కంపెనీ షేర్లు నంబర్ 8, 2021 ఐపీవో సమయంలో దరఖాస్తుదారులకు ఒక్కోటి రూ.2150 ధర వద్ద విక్రయించబడ్డాయి. అయితే తర్వాత మార్కెట్లోకి అడుగుపెట్టే సమయంలో స్టార్టప్ కంపెనీ షేర్లు డిస్కౌంట్ రేటు వద్ద జాబితా కావటం ఇన్వెస్టర్లకు పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాతి కాలంలో కంపెనీ వాల్యుయేషన్లలపై చెలరేగిన వివాదంతో పాటు వివిధ రెగ్యులేటరీ కారణాలు స్టాక్ ధర పతనానికి దారితీశాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications