Paytm Stock Fall: భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో పెద్ద మార్పులకు ఆజ్యం పోసిన కంపెనీల్లో పేటీఎం కూడా చెప్పుకోదగిన పాత్రను కలిగి ఉంది. అయితే విజయశేఖర్ శర్మ కంపెనీని ఏ ముహూర్తంలో ప్రారంభించారో తెలియదు కానీ వరుసగా జరుగుతున్న పరిణామాలు మాత్రం కంపెనీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ చర్యల తర్వాత ఇది మరింతగా దిగజారింది.
ఈ క్రమంలోనే నేడు పేటీఎం స్టాక్ ఇంట్రాడేలో దాదాపు 9 శాతం పతనాన్ని చూడటంతో ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్టాక్ ధర రూ.773.90 స్థాయికి పడిపోయింది. దీనికి కారణం క్రిప్టో కరెన్సీ స్కాంకి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న ఎనిమిది పేమెంట్ గేట్‌వే కంపెనీల్లో పేటీఎం కూడా ఉండటమేనని వెల్లడైంది. వాస్తవానికి ఈడీ అధికారులు ప్రస్తుతం ఈ పేమెంట్ గేట్‌వే లకు సంబంధించిన దాదాపు రూ.500 కోట్లను ఫ్రీజ్ చేశారని తెలుస్తోంది. ఇది చైనా కేంద్రంగా కొనసాగుతున్న క్రిప్టో మోసంగా అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈడీ అధికారులు చేపట్టిన దర్యాప్తులో పేటీఎంతో పాటుగా రేజర్ పే, పేయూ, ఈజ్ బజ్ సహా మరికొన్ని చెల్లింపు కంపెనీలు ఉన్నట్లు వెల్లడైంది. గడచిన రెండేళ్లుగా వీటికి సంబంధించిన వర్చువల్ ఖాతాల్లో దాదాపు రూ.500 కోట్లను ఈడీ అధికారులు ఫ్రీజ్ చేసి ఉంచారు. వీటికి చైనాలోని 10 కంపెనీలతో సంబంధం ఉన్నట్లు వారు చెబుతున్నారు. ఈ విషయంపై ఎన్ఎస్ఈ, బీఎస్ఈ అడగగా పేటీఎం మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదని తెలుస్తోంది.
ఈ వార్తలతో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో పేటీఎం షేర్లు భారీ వాల్యూమ్ లలో ట్రేడింగ్ కొనసాగుతున్నాయి. గడచిన రెండువారాల సగటు కంటే అధిక స్థాయిలో నేడు పేటీఎం షేర్లు మార్కెట్లో క్రయవిక్రయాలు జరిగాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.52,778 కోట్లుగా ఉంది. అలాగే ఉదయం 11.27 గంటల సమయంలో కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.821.50 వద్ద 2.78 శాతం తగ్గుదలతో కొనసాగుతున్నాయి.
బ్రోకరేజ్ అభిప్రాయం ఇదే..
పేటీఎం కంపెనీ షేర్లపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జేఎం ఫైనాన్షియల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పేటీఎం బలమైన మార్జిన్ ఇంక్రిమెంటల్ లాభదాయకత ట్రాక్ రికార్డ్ కలిగి ఉందని బ్రోకరేజ్ వెల్లడించింది. మార్చి 2026 నాటికం కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.1,250 స్థాయికి చేరుకుంటుందని టార్గెట్ ధరను ప్రకటించింది. అలాగే ప్రస్తుతం పేటీఎం షేర్లకు తిరిగి BUY రేటింగ్ కొనసాగిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications