Paytm stock: దేశంలోని ఫిన్‌టెక్ స్టార్టప్ సంస్థ పేటీఎం పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. దీంతో కంపెనీ షేర్లు సైతం తమ పతనం కొనసాగిస్తున్నాయి. తాజా డేటా ప్రకారం పేటీఎం డిజిటల్ చెల్లింపుల వ్యాపారం తగ్గుదలను సూచిస్తోంది. దీంతో వరుసగా 10వ రోజున పేటీఎం షేర్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో కుప్పకూలాయి.
నేడు సైతం పేటీఎం కంపెనీ షేర్లు 4 శాతం మేర పతనాన్ని కొనసాగించాయి. దీంతో షేర్ ధర రూ.320 స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం స్టాక్ ఫిబ్రవరి 16, 2024న నమోదైన ఆల్-టైమ్ కనిష్టమైన రూ.318కి దగ్గరగా ప్రస్తుతం పేటీఎం షేర్లు ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఫిన్‌టెక్ సంస్థకు కీలక రుణ భాగస్వాముల్లో ఒకరైన ఆదిత్య బిర్లా ఫైనాన్స్ రుణాలు అందించేందుకు నిరాకరించినట్లు నివేదికలు మార్కెట్లో వస్తున్నాయి. వాస్తవానికి పేటీఎం కస్టమర్ల నుంచి రీపేమెంట్స్ డిఫాల్ట్‌లను బిర్లా ఫైనాన్స్ కారణంగా చూపినట్లు తెలుస్తోంది. ఇది కంపెనీకి ఆర్బీఐ ఆంక్షల తర్వాత పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవాలి. కొంత మంది పేటీఎం వినియోగదారులకు గతంలో అందించిన ప్రీఅప్రూవ్డ్ రుణ లిమిట్ ఇప్పటికే బిర్లా ఫైనాన్స్ క్లోజ్ చేయటం వార్తకు మరింతగా బలాన్ని జోడిస్తోంది.

2024లో ఇప్పటి వరకు పేటీఎం కంపెనీ షేర్లు దాదాపు 50 శాతం క్షీణతను చూశాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఇటీవల రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన ఆంక్షల తర్వాత ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌తో పాటు, పిరమల్ ఫైనాన్స్, క్లిక్స్ క్యాపిటల్ వంటి ఇతర రుణదాతలు సైతం ఫిన్‌టెక్ కంపెనీతో భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకున్నాయని నివేదికలు తెలిపాయి. అలాగే మార్చిలో 1,230.04 మిలియన్లుగా ఉన్న పేటీఎం యూపీఐ లావాదేవీలు.. ఒక్క నెలలో 9 శాతం క్షీణించి ఏప్రిల్‌లో 1,117.3 మిలియన్లుగా నమోదయ్యాయి. దీంతో కంపెనీ యూపీఐ చెల్లింపుల మార్కెట్ వాటా ఫిబ్రవరిలో 10.8 శాతం నుంచి మార్చిలో 9.13 శాతం తగ్గింది.
ఇక బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ పేటీఎం నాలుగో త్రైమాసిక ఫలితాల అంచనాల ప్రకారం.. కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 21.5 శాతం తగ్గి రూ.2,340 కోట్ల నుంచి రూ.1,830 కోట్లకు చేరుకుందని అంచనా వేసింది. ఈ క్రమంలో కంపెనీ నికర నష్టం గత ఏడాది నాలుగో త్రైమాసికంలో నమోదైన రూ.170 కోట్ల నుంచి ఈ సారి రూ.470 కోట్లకు పెరుగుతుందని వారు అంచనా వేశారు. ఈ వార్తలు కంపెనీపై ఇన్వెస్టర్ల నమ్మకాన్ని సడలిస్తున్నాయి. భవిష్యత్తులో కంపెనీ షేర్లు మరింత పతనాన్ని చూస్తాయనే ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. ఇదే క్రమంలో కంపెనీ షేర్లకు బ్రోకరేజ్ న్యూట్రల్ రేటింగ్ కొనసాగిస్తూ టార్గెట్ ధరను రూ. 475గా ఉంచింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications