Paytm Stock: సోమవారం కుప్పకూలనున్న పేటీఎం స్టాక్.. ఎందుకంటే..??
Paytm Shares: కొన్ని నెలల కిందట దేశీయ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎంపై కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై చర్యలు తర్వాత స్టాక్ ఊహించని రీతిలో క్షీణతను చూసిన సంగతి తెలిసిందే.
గతవారం చివర్లో కంపెనీ షేర్లు దాదాపు 10 శాతం మేర లాభపడ్డాయని తెలిసిందే. ఈ పరిస్థితులను చూస్తుంటే ఇన్వెస్టర్లకు తిరిగి మంచిరోజులు వస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే సోమవారం కంపెనీ షేర్లలో పెద్ద అలజడి కనిపించనుందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. కంపెనీకి శనివారం ఒక చేదు వార్త వచ్చింది. భారతదేశ UPI మార్కెట్‌లో Paytm స్థానం ఇప్పటికే బలహీనంగా ఉందని తాజా డేటా ప్రకారం వెల్లడైంది. UPIలో Paytm మార్కెట్ వాటా వరుసగా నాలుగో నెల కూడా క్షీణించిందని గణాంకాలు చెబుతున్నాయి. యూపీఐ చెల్లింపుల్లో కంపెనీ వాటా జనవరిలో 13 శాతం నుంచి మే నెలలో 8.1 శాతానికి క్షీణించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం వెల్లడైంది.

జూన్ 7న కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఆ తర్వాత పేటీఎం షేర్ల ధర 10 శాతం పెరిగి రూ.381.20 స్థాయికి చేరుకుంది. అంతకుముందు జూన్ 4, 5 తేదీల్లో కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. తాజా డేటా బయటకు రావటంతో ప్రస్తుతం ఇన్వెస్టర్లు, ట్రేడర్ల దృష్టి పేటీఎం షేర్లపైనే ఉండనుంది. కంపెనీకి జనవరి నెల గొప్పది. అయితే ఈ నెలలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌పై రిజర్వ్ బ్యాంక్ కఠిన నిర్ణయం తీసుకుంది. దీని ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుంది. అప్పటి నుంచి పేటీఎం షేర్ల ధరలు 55 శాతం క్షీణించింది.
యూపీఐ చెల్లింపుల్లో మే నెలలో మెుత్తం 14.04 బిలియన్ల UPI లావాదేవీలు జరిగాయి. ఈ క్రమంలో పేటీఎం సంస్థ మార్కెట్లో PhonePe, Google Pay నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. మేలో, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని కంపెనీ ఫోన్‌పే UPI లావాదేవీల్లో అత్యధికంగా 49 శాతం వాటాను కలిగి ఉంది. అదే సమయంలో భారత మార్కెట్లో గూగుల్ పే 37 శాతం వాటాను కలిగి ఉందని వెల్లడైంది.
రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తర్వాత పేటీఎం సంస్థ యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ టై-అప్ ద్వారా Paytm నుంచి UPI లావాదేవీలు నిరంతరం కొనసాగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తర్వాత ఆదాయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కంపెనీ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. సమస్యల కారణంగా నాలుగో త్రైమాసికంలో ఆదాయం, లాభాలు దెబ్బతింటాయని విజయ్ శంకర్ శర్మ ఇటీవల చెప్పారు. అయితే మార్కెట్లో కంపెనీ వేగంగా వాటాను కోల్పోవటం మరింత పెద్ద ఎదురుదెబ్బని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications