Paytm: బ్లాక్ డీల్ వార్తలతో ఉదయం పేటీఎం షేర్లు పతనంతో ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇప్పటికే షేర్ ధర భారీగా పతనం అవటంతో ఇన్వెస్టర్లు నిరాశగా ఉన్నారు.

పెట్టుబడి ఉపసంహరణ..
చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా పేటీఎంలో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు అలీబాబా బ్లాక్ డీల్ ద్వారా ఫిన్ టెక్ కంపెనీ పేటీఎంకు సంబంధించిన రెండు కోట్ల షేర్లను బ్లాక్ డీల్ ద్వారా విక్రయించింది. దీనిద్వారా పేటీఎంలో ఉన్న 3.4 శాతం వాటాను చైనా దిగ్గజం వదులుకుంది. నేడు జరిగిన విక్రయంతో అలీబాబా Paytmలో వాటాదారు కాదు.

ఈరోజు షేర్ ధర..
నేడు పేటీఎం మార్కెట్ క్లోజింగ్ సమయానికి స్టాక్ ధర రూ.650.55గా ఉంది. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో స్టాక్ గరిష్ఠంగా రూ.705 మార్కును తాకగా.. అత్యల్పంగా రూ.640ని టచ్ చేసింది. అలాగే స్టాక్ 52 వారాల పనితీరును గమనించినట్లయితే.. గరిష్ఠంగా రూ.958.75 ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.438.35గా ఉంది. ఇటీవల కంపెనీ తొలిసారిగా లాభాల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.

మార్కెట్ సమాచారం..
బీఎస్ఈలో డేటా ప్రకారం ఎక్స్ఛేంజీల్లో మెుత్తం 4.73 కోట్ల చేతులు మారాయి. స్క్రిప్ చివరికి 7.82 శాతం తగ్గి రూ.650.75 వద్ద ముగిసింది. 2023లో ఇప్పటివరకు స్క్రిప్ 22 శాతం పెరిగింది. సాఫ్ట్‌బ్యాంక్ మద్దతుగల సంస్థ ఆదాయం గత ఏడాది త్రైమాసికంలో రూ.1,456 కోట్ల నుంచి 42 శాతం పెరిగి రూ.2,062 కోట్లకు చేరుకుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications