Paytm Shares: చాలా కాలంగా పేటీఎం ఇన్వెస్టర్లు తమకూ మంచి రోజులు వస్తాయని ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఫిన్ టెక్ స్టార్టప్ కంపెనీల షేర్లు నేడు తమ 52వారాల గరిష్ఠాన్ని తాకటంతో ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలుకు డిమాండ్ కొనసాగుతోంది.
ఈ క్రమంలో నేడు వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు నేడు ఇంట్రాడేలో దాదాపు 3 శాతానికి పైగా వృద్ధిని చూశాయి. దీంతో కంపెనీ షేర్ల ధర చాలా కాలం తర్వాత రూ.1000ని క్రాస్ చేసి రూ.1007 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. అయితే స్టాక్ సడెన్ రైజ్‌కి కారణాలను పరిశీలిస్తే.. జపనీస్ పెపే కార్ప్‌లోని వాటాలను సాఫ్ట్‌బ్యాంక్‌కు విక్రయిస్తున్నట్లు ప్రకటించడమేనని వెల్లడైంది. కంపెనీ బోర్డు ఈ సేల్ కోసం అంగీకరించటంతో రూ.2,364 కోట్లకు డీల్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మెుదట్లో కంపెనీ రిజర్వు బ్యాంక్ కఠిన చర్యల జోల్ట్ నుంచి తిరిగి తేరుకుంటున్న వేళ స్టాక్ ధర బలపడుతూ వచ్చింది. మే నెలలో స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.310 వద్దకు దిగజారిన స్టాక్ ధర బుల్‍రన్‍తో పాటు వ్యాపారాన్ని మెరుగుపరచటంతో స్టాక్ 225 శాతం రాబడిని తన ఇన్వెస్టర్లకు అందించింది.

తాజా విక్రయం ద్వారా వచ్చే డబ్బు కంపెనీ నగదు నిల్వలను మెరుగుపరుస్తుందని తెలుస్తోంది. ఇన్వెస్టర్లకు విలువ సృష్టిపై దృష్టి సారించే భవిష్యత్ వ్యాపార కార్యక్రమాలను కొనసాగించడంలో ఈ చర్య సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ దీనికి ముందు తన మూవీ టికెట్ బుకింగ్ వ్యాపారాన్ని ఫుడ్ డెలివరీ స్టార్టప్ కంపెనీ జొమాటోకు విక్రయించిన సంగతి తెలిసిందే. కంపెనీ వ్యూహాత్మకంగా కొన్ని నెలలుగా చేపడుతున్న పనుల ద్వారా కోర్ వ్యాపారంపై ఫోకస్ కోసం కొన్ని విభాగాలను విక్రయిస్తున్నట్లు అర్థం అవుతోంది. ఈ క్రమంలోనే వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్ల నుంచి కంపెనీ షేర్లు నిరంతరం పెరుగుతున్నాయి.
బ్రోకరేజ్ అంచనాలు..
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టెయిన్ పేటీఎం టార్గెట్ ధరను రూ.750 నుంచి రూ.1,000కి అప్‍గ్రేడ్ చేసింది. ఇదే క్రమంలో పేటీఎం షేర్లకు తన 'అవుట్ పెర్ఫార్మ్' రేటింగ్‌ను కొనసాగిస్తోంది. కంపెనీ చెల్లింపు మార్జిన్ రికవరీ, రుణ విస్తరణ, రెగ్యులేటరీ టెయిల్‌విండ్‌ల తర్వాత ఈపీఎస్ పెరగనున్నట్లు అంచనాల మధ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనికి ముందు నవంబర్ చివరి వారంలో యూబీఎస్ బ్రోకరేజ్ పేటీఎం కంపెనీ షేర్లకు తన టార్గెట్ ధరను రూ.490 నుంచి డబుల్ చేసి రూ.1,000కి పెంచింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications