Paytm Shares: కుప్పకూలిన పేటీఎం స్టాక్.. ఇన్వెస్టర్లు కన్నీరు మున్నీరు..!
Paytm Stocks: దేశంలోని పేమెంట్స్ వ్యాపారంలో అనేక నూతన సాంకేతికతలను ఆవిష్కరించిన సంస్థ పేటీఎం. యూపీఐ చెల్లింపు వ్యవస్థను ముందుగా ప్రారంభించి చాలా మందికి చేరువ చేసింది.
అయితే ప్రస్తుతం కంపెనీ అనేక రెగ్యులేటరీ అడ్డంకులను ఎదుర్కొంటోంది. గతంలోనూ పలుమార్పు ఫిన్ టెక్ కంపెనీ వ్యాపారంపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. ఐపీవోగా మార్కెట్లో వచ్చినప్పుడు నిరాశకు గురిచేసినప్పటికీ కంపెనీ తన పనితీరును మెరుగుపరుచుకుంటూ వేగంగా లాభదాయకమైన స్టార్టప్ కంపెనీల్లో ఒకటిగా నిలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా RBI పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలను మార్చి 1, 2024 నుంచి నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో పేటీఎం షేర్ హోల్డర్లలో పెద్ద అలజడి మెుదలైంది. నేడు ఉదయం మార్కెట్లు ఓపెన్ కాగానే చాలా మంది పెట్టుబడిదారులు తమ షేర్లను విక్రయించేందుకు ఎగబడ్డారు. అలా కొన్ని క్షణాల్లోనే పేటీఎం స్టాక్ 20 శాతం క్షీణతకు గురైంది. దీంతో ఇంట్రాడేలో ఉదయం 9.28 గంటల సమయంలో పేటీఎం షేర్ ధర రూ.609 వద్ద ఉంది. అయితే ఈ అమ్మకాల ధోరణి రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోపక్క ఆర్బీఐ చర్యలు కంపెనీ ఆదాయాన్ని సైతం తగ్గించేవిగా ఉన్నట్లు వెల్లడికావటంతో అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది.
ఇటీవల పేటీఎం వ్యాపారంపై జెఫరీస్ నోట్ రిలీజ్ చేస్తూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆంక్షలు కారణంగా కంపెనీ లెండింగ్ పార్టనర్‌లు వ్యాపారాన్ని పరిమితం చేసే ప్రమాదం ఉందని పేర్కొంది. అదే గనుక జరిగితే రుణవితరణ వ్యాపారం నుంచి వస్తున్న 20 శాతం ఆదాయంపై పరోక్షంగా ప్రభావం ఉంటుందని పేర్కొంది. అయితే ప్రస్తుతం రిజర్వు బ్యాంక్ ఆంక్షలు వారి సేవింగ్స్ ఖాతాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లలోని వినియోగదారుల డిపాజిట్లపై ప్రభావం చూపవని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది.


Click it and Unblock the Notifications