Paytm Stock Crash: దేశంలో యూపీఐ చెల్లింపుల నుంచి అనేక ఇతర సేవలను అందిస్తున్న ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం. వాస్తవానికి గత కొన్ని త్రైమాసికాలుగా కంపెనీ లాభదాయకతవైపు నడుస్తుండటంతో స్టాక్ మంచి ర్యాలీని చూసింది.
తాజాగా కంపెనీ షేర్లు నేడు మార్కెట్లో 20 శాతం నష్టపోయి లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. వాస్తవానికి కంపెనీ చిన్న మెుత్తాల్లో అందిస్తున్న పోస్ట్ పే లోన్ల వ్యాపారాన్ని తగ్గించాలని చూస్తున్నట్లు ప్రకటించిన వేళ ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకానికి మెుగ్గుచూపారు. ప్రస్తుతం కంపెనీ పెద్ద మెుత్తంలో పర్సనల్ లోన్స్, మర్చంట్ రుణాలపై దృష్టి సారించిన క్రమంలో వ్యాపార వ్యూహాన్ని మార్చాలని నిర్ణయించింది.

అయితే బ్రోకరేజ్ సంస్థలు సైతం కంపెనీ తాజా చర్య వల్ల ఆదాయాలు పడిపోతాయని అంచనా వేస్తున్నాయి. ఉదయం 10.40 గంటల సమయంలో పేటీఎం స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.673 వద్ద ఉంది. అయితే ఇంట్రాడేలో స్టాక్ భారీ క్షీణత వల్ల రూ.650 స్థాయిని తాకింది. కంపెనీ తన పోస్ట్ పెయిడ్ లోన్లను సగానికి తగ్గించాలని చూస్తున్నట్లు స్పష్టంగా ప్రకటించింది. అయితే తమ తాజా నిర్ణయం వల్ల ఆదాయాలపై పెద్దగా ప్రభావం ఉండబోదని పేర్కొంది.
ఇటీవల దేశంలో విపరీతంగా పెరిగిన క్రెడిట్ వినియోగం, రుణాలపై జాగ్రత్త అవసరమని రిజర్వు బ్యాంక్ పేర్కొన్న వేళ పేటీఎం తన బైనౌ పే లేటర్ వ్యాపారాన్ని పునఃపరిశీలించాలని Paytm నిర్ణయం తీసుకున్నట్లు బ్రోకరేజ్ సంస్థ Jefferies పేర్కొంది. మొత్తం చెల్లింపుల్లో 55 శాతం ఉన్న BNPL పంపిణీలు వచ్చే 3-4 నెలల్లో సగానికి తగ్గుతాయని జెఫరీస్ ఒక నోట్‌లో వెల్లడించింది.
ఈ క్రమంలో జెఫరీస్ పేటీఎం FY24-26 రాబడి అంచనాలను 3-10 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది సర్దుబాటు చేసిన EBITDA అంచనాలను 12-15 శాతం తగ్గించింది. ఈ క్రమంలో పేటీఎం షేర్లకు తన 'కొనుగోలు' కాల్‌ని కొనసాగిస్తున్నప్పటికీ.. టార్గెట్ ధరను 19 శాతం మేర తగ్గిస్తూ రూ.1,050కి సవరించింది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications