Paytm Stock: పేటీఎం ఇన్వస్టర్లకు మంచి రోజులు..! షేర్లలో ఇన్వెస్ట్ చేయెుచ్చా..

Paytm News: దేశీయ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం పరిస్థితి ఇటీవలి నెలల్లో దిగజారిన సంగతి తెలిసిందే. వేగంగా లాభదాయకమైన కంపెనీగా మారుతున్న ప్రయాణ క్రమంలో రిజర్వు బ్యాంక్ చర్యలు కంపెనీని అతలాకుతలం చేశాయి. వాస్తవానికి కంపెనీ మనుగడ ఇక సాధ్యమేనా అన్నంత స్థాయికి పరిస్థితులు దిగజారటం ఇన్వెస్టర్లను అయోమయంలోకి నెట్టేసింది.

అయితే కంపెనీ చేపడుతున్న దిద్దుబాటు చర్యలు ఈక్విటీ ఇన్వెస్టర్లలో కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నాయి. ఈ క్రమంలోనే కంపెనీ నిన్న లోన్ లెండింగ్ భాగస్వాములపై వివిధ వార్తా సంస్థలు ప్రచురించిన కథనాలను ఖండించింది. ఆదిత్యా బిర్లా ఫైనాన్స్ సహా మరిన్ని కంపెనీలు లోన్ గ్యారెంటీ ఇచ్చేందుకు నికారణ కారణంగా పేటీఎంతో వ్యాపార భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయంటూ వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. అవి పూర్తిగా నిరాదారమైనవని తప్పుడు కథనాలను సవరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. తాము కేవలం రుణాల పంపిణీలో భాగస్వాములమేనని రుణం ఇచ్చేందుకు పూర్తి విచక్షణ సదరు కంపెనీల చేతిలో ఉంటాయని వెల్లడించింది. ఈ వార్తలు దేశీయ స్టాక్ మార్కెట్లోని పేటీఎం ఇన్వెస్టర్లలో కొత్త జోష్ నింపాయి.

Paytm Stock Bounce Back amid company clarity over Business with Loan partners gain 13

దీనికి తోడు కంపెనీ ఇతర వ్యాపార అవకాశాల నుంచి ఆదాయాన్ని పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇన్వెస్టర్లలో కంపెనీపై నమ్మకాన్ని పెంచుతున్నాయి. దీని ఫలితంగా రెండు రోజుల్లో పేటీఎం షేర్లు దాదాపు 13 శాతం ర్యాలీని నమోదు చేశాయి. శుక్రవారం మార్కెట్ ట్రేడింగ్ సమయంలో స్టాక్ ధర 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. దీంతో ఒక్కో షేరు ధర బీఎస్ఈలో రూ.349.95 స్థాయికి చేరుకుంది.

పేటీఎం ఒక ప్రకటనలో పర్సనల్ లోన్ పంపిణీ వ్యాపారం ఎలాంటి అంతరాయం లేకుండా సాఫీగా నడుస్తోంది. రుణదాతలు లోన్ గ్యారెంటీని అమలు చేయడం గురించి చేసిన వాదనలు పూర్తిగా తప్పిదమైనవిగా పేర్కొంది. దీనికి ముందు కంపెనీ పనితీరుపై వెల్లడైన అనుమానాలతో మే 9న కంపెనీ షేర్లు ఒక్కోటి జీవితకాల కనిష్ఠమైన రూ.310 స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఇది కంపెనీ 52 వారాల కనిష్ఠ ధరగా ఉంది. అలాగే కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.998.30గా ఉన్నాయి. కంపెనీ షేర్లు త్వరలోనే రూ.370 స్థాయిలను అధిగమించి ఒక్కోటి రూ.400కి చేరుకుంటుందని సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇవి చూస్తుంటే పేటీఎం స్టాక్ ఇన్వెస్టర్లకు తిరిగి మంచి రోజులు మెుదలైనట్లు నిపుణులు చెబుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+