Paytm share fall: రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల వల్ల పేటీఎం పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. షేర్ విలువ అంతకంతూ పడిపోతూ సరికొత్త కనిష్ఠాలను నమోదు చేస్తోంది. ఇవాళ ట్రేడింగ్ సెషన్‌లోనూ నష్టాలను మూటగట్టుకుని ఆల్‌టైం క్షీణతను రికార్డ్ చేసింది.
వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (పేటీఎం)కి చెందిన షేర్స్ ఇవాళ ఉదయం 9.32 శాతం మేర క్షీణించాయి. దీంతో BSEలో తాజా ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 344.90ని టచ్ చేశాయి. విదేశీ బ్రోకరేజ్ మేక్వరీ తన టార్గెట్ ధరను 275కి తగ్గించడంతో నిన్న దాదాపు 10 శాతం పడిపోయాయి. ఆ తర్వాతి రోజే మరోసారి క్షీణించడంతో ప్రస్తుతం ఫిన్‌టెక్ మేజర్ మనుగడ కోసం పోరాడుతున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

'కస్టమర్లు ఇతర యాప్‌లకు వలస వెళ్తుండటంతో పేటీఎం తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఈ చర్య దాని మానిటైజేషన్ మరియు వ్యాపార నమూనాను గణనీయంగా దెబ్బతీస్తుంది' అని మేక్వరీ తెలిపింది. దీనికితోడు తన లెండింగ్ వ్యాపారంలో ఎదురవుతున్న కార్యాచరణ సవాళ్లను పరిష్కరించడానికి మరియు కొత్త రుణాల మంజూరును పునఃప్రారంభించడానికి తాత్కాలిక గడువు ఈరోజుతో ముగియనుంది. దీంతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.
ఫిబ్రవరి 1న జరిగిన కంపెనీ కాన్ఫరెన్స్ కాల్‌లో పేటీఎం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) మరియు ప్రెసిడెంట్ భవేష్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలకు RBI ద్వారా ఎదురైన సవాళ్లను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఈలోపు కొన్ని వారాల వరకు కొత్త రుణాలను జారీ చేయదని ప్రకటించారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications