Paytm Shares: దేశీయ ఫిన్ టెక్ స్టార్టప్ కంపెనీ పేటీఎంలో ఇన్వెస్ట్ చేసిన వారి పరిస్థితి రోలర్‌కోస్టర్ ప్రయాణానికి ఏమాత్రం తక్కువగా లేదు. కంపెనీలో ఎప్పుడు ఏం జరుగుతుందో. దాని ప్రభావం ఎలా ఉంటుందో అనే ఆందోళన రోజురోజుకూ వారిలో పెరుగుతూనే ఉంది.
అయితే ప్రస్తుతం కొన్ని రోజులుగా పేటీఎం షేర్లలో భారీ పెరుగుదల కొనసాగుతోంది. ఈ క్రమంలో కంపెనీ షేర్లు నేడు అంటే జూన్ 13న ఇంట్రాడేలో 8 శాతం కంటే ఎక్కువ పెరుగుదలతో రూ.438.95 స్థాయికి చేరాయి. 5 రోజుల్లో కంపెనీ షేర్లు 25 శాతానికిపైగా పెరిగాయి. వాస్తవానికి కంపెనీ నుంచి వచ్చిన రెండు బిజినెస్ అప్‌డేట్స్ దీనికి కొంత మేర దోహదపడ్డాయని తెలుస్తోంది. పేటీఎం కంపెనీ మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసిన వివరాల ప్రకారం.. దేశంలోని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ IRDAI సాధారణ బీమా కంపెనీగా నమోదు చేసుకోవడానికి పేటీఎం చేసిన దరఖాస్తును ఉపసంహరించుకోవాలని చేసిన అభ్యర్థనను ఆమోదించినట్లు వెల్లడించింది.

డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం తన అనుబంధ సంస్థ పేటీఎం ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా హెల్త్, లైఫ్, మోటార్, షాప్, గాడ్జెట్స్ విభాగాల్లో బీమా పంపిణీపై దృష్టి సారిస్తుంది. కంపెనీ చిన్న-టికెట్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలనుకుంటోంది. తాజాగా Paytm గురువారం శాంసంగ్‌తో భాగస్వామ్యం కుదిరినట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం భారతదేశంలోని Samsung Walletకు ప్రయాణ, వినోద సేవలను అందించడం కోసం కుదుర్చుకోబడింది.
గత ఏడాది కాలంలో పేటీఎం షేర్లు బాగా క్షీణించాయి. పేమెంట్ అగ్రిగేటర్ కంపెనీ షేర్లు ఏడాదిలో 45 శాతానికి పైగా పడిపోయాయి. జూన్ 13, 2023న పేటీఎం షేర్లు రూ.833 వద్ద ఉన్నాయి. జూన్ 13, 2024న కంపెనీ షేర్లు రూ.438.95కి చేరుకున్నాయి. గత 6 నెలల్లో పేటీఎం షేర్లు దాదాపు 27% క్షీణించాయి. డిసెంబరు 13, 2023న కంపెనీ షేర్లు రూ.601.45 వద్ద ఉండగా ప్రస్తుతం రూ.438 స్థాయిలో ఉన్నాయి. ఐపీవో సమయంలో పేటీఎం స్టాక్ ధర ఒక్కోటి రూ.2150 వద్ద విక్రయించబడిన సంగతి తెలిసిందే. అయితే తొలిరోజు మార్కెట్లోకి అడుగుపెట్టే సమయంలో షేర్ ధర డిస్కౌంట్ రేటు రూ.1955 వద్ద నిరాశకు గురిచేశాయి. పేటీఎం షేర్ల 52 వారాల కనిష్ట స్థాయి రూ.310గా ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.998.30 వద్ద ఉంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications